యంగ్ హీరో సుధీర్ బాబు తన మామగారు ఘట్టమనేని కృష్ణ అభిమానులను తన బావ మహేష్ బాబు అభిమానులను తెలివిగా మేనేజ్ చేస్తున్నాడా? ప్రస్తుతం ఇతడి ప్రవర్తన చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలలోకి వచ్చి సూపర్ స్తర్ ఇమేజ్ ను సంపాదించుకున్నా తన తండ్రి సినిమాల టైటిల్స్ వైపు, పాటల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ దీనికి విరుద్ధంగా సుధీర్ బాబు సూపర్ స్టార్ కృష్ణ సినిమా టైటిల్స్ ను, పాటలను ధారాళంగా వాడు కుంటున్నాడు.

సుధీర్ బాబు నటించబోతున్న మూడవ సినిమాకు ‘మాయదారి మల్లిగాడు’ అనే టైటిల్ కన్ ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో బెస్ట్ మూవీగా చెప్పుకునే మాయదారి మల్లిగాడు 1975 ప్రాంతంలో సూపర్ హిట్, ఈ సినిమాను అప్పటి ప్రముఖ దర్శకులు ఆదర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ ఇమేజ్ ను, మహేష్ బాబు పాప్ లారిటిని రెండిటిని ఉపయోగించు కుంటూ ‘ప్రేమ కధా చిత్రమ్‘  సక్సస్ ఇచ్చిన ఉత్సాహంతో వడివడి గా తన కెరియర్ ను నిర్మించుకునే మార్గం వైపు సుధీర్ అడుగులు వేస్తున్నాడు. ఇక డ్యాన్స్ విషయంలో తన బావ మహేష్ కంటే రెండడుగులు ముందే ఉన్న సుధీర్ బాబు తన కెరియర్ ను ఇలాగే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే టాలీవుడ్ లో హీరోగా నిలబడే అవకాశాలు చాలా ఉన్నాయి అంటున్నారు .

మెగా ఫ్యామిలీ హీరోల కుటుంబంలా ఇక ఘట్టమనేని కుటుంబ హీరోలు కూడా టాలీవుడ్ ను ఏలుతారు అని అనుకోవాలి. మహేష్ టాలీవుడ్ నెంబర్ వన్ అయితే డ్యాన్స్ లలో మాత్రం సుధీర్ తన బావ మహేష్ ను డామ్ నేట్ చేస్తాడనుకోవాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: