స్వామి రారా సినిమాతో ఓ విజ‌యం అందుకొంది స్వాతి. ఇప్పుడు మ‌ళ్లీ కూ...త పెడుతోంది. బంగారు కోడి పెట్ట సినిమా కోసం. ఇది కూడా దొంగ‌త‌నం, డ‌బ్బు... వీటి చుట్టూ తిరిగే క‌థేన‌ట‌. థ్రిల్ల‌ర్ త‌ర‌హాలో సాగుతుంద‌ట‌. ఈ సినిమాతో అయినా త‌న‌ని హీరోయిన్‌గా గుర్తిస్తార‌ని గంపెడు ఆశ‌లు పెట్టుకొంది స్వాతి. అయితే మామూలు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో లా.. ఇందులో క‌థానాయకుడితో డ్యూయెట్లు, రొమాన్స్ ఉండ‌వు. మ‌రి..?  హీరోయిన్‌గా ఎలా గుర్తిస్తారు అనుకొంటుందో ఏమో?

ఆ సినిమాలో స్వాతి ప‌క్క‌న న‌వ‌దీప్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఆయ‌న‌దా... ఫిట్టుకొట్టే ఫేసు కాదాయే. మ‌రోవైపు ఈ సినిమాని టేక‌ప్ చేస్తున్న‌ది రాజ్ పిప్ప‌ళ్ల‌. ఆయ‌న బోణీ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బోల్తా ప‌డింది. ఇద్ద‌రు ఐరెన్ లెగ్గుల మ‌ధ్య స్వాతి సాధించేది ఏమిటో?  మ‌రి ఈ కూత జ‌నాల‌కు వినిపిస్తుందో లేదో. 

��
అన్న‌ట్టు ఈ సినిమాలో చిత్ర‌విచిత్ర‌మైన స‌న్నివేశాలున్నాయ‌ట‌.  కోడి పుంజుని కిడ్నాప్ చేయ‌డం, సినిమా అడిష‌న్స్, పేకాట టోర్న‌మెంట్‌ ఇలా విచిత్రాలు ఎన్నో చూపిస్తార‌ట‌. వ‌చ్చే నెల‌లో ఈసినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: