అనుష్క పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డింద‌ని తాజాగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వినిపిస్తున్న స‌మాచారం. ప‌ర్సన‌ల్ లైఫ్ ఎంజాయ్ చేసేంత టైం అనుష్కకు లేకున్నా, త‌న‌ను క‌నిపెట్టుకొని వెయిట్‌ చేసే ప్రియుడు మాత్రం ఉన్నాడ‌ని తెలుస్తుంది. వ‌ర్ణ,రాణి రుద్రమ‌దేవి,బాహుబ‌లి ఇలా భారీ ప్రాజెక్టుల్లో త‌ల మున‌క‌లైన అనుష్క, లేటెస్ట్‌గా ఓ ఎన్‌.ఆర్‌.ఐ తో తెగ ముచ్చట్లు చెబుతుంది.

ఢ‌మ‌రుకం మూవీ అప్పుడు ఓ ఎన్‌.ఆర్‌.ఐ బిజినెస్ మెన్‌తో అనుష్కకు ప‌రిచ‌యం అయింది. ఆ త‌రువాత కొద్దికొద్దిగా ప‌రిచ‌యం ముదిరి కేరింగ్ వ‌ర‌కూ వ‌చ్చింద‌ట‌. బాహుబ‌లి కోసం హెల్త్ టిప్స్‌ను ఫాలో అవుతున్న అనుష్క గురించి ప్రతి రోజు ఫోన్ చేసి మ‌రీ ఫారిన్ డాక్టర్లచేత హెల్త్ టిప్స్‌ను ఇప్పిస్తున్నాడ‌ట‌.

అనుష్క కూడ త‌న కొత్త ల‌వ‌ర్‌తో తియ్యతియ్యగానే క‌బుర్లు చెబుతుంది. ఇద్దరూ క‌లుసుకునేంత టైం లేక‌పోయినా, ప్రతి రోజు రాత్రి మాత్రం ఓ రెండు గంట‌ల పాటు వీడియో చాట్ చేసుకుంటూ క‌బుర్లు చెప్పుకుంటున్నార‌ని టాలీవుడ్ టాక్‌. అయితే అనుష్క పై కేరింగ్ తీసుకునే వాళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చాలానే ఉన్నారు క‌దా, మ‌రీ కొత్త ప‌రిచ‌యం ఎందుకు అంటూ అదో రకంగా ఆలోచిస్తున్నారు సినీ ప్రేక్షకులు

మరింత సమాచారం తెలుసుకోండి: