టాలీవుడ్ జక్కన్న గా అందరిచేతా ముద్దుగా పిలిపించుకునే రాజమౌళి తన అభిమానులతో ఎప్పుడూ తన విషయాలను, తన భావాలను తన ట్విటర్ ద్వారా పంచు కుంటూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అయితే రాజమౌళి కి తాజాగా తన ట్విటర్ లో ఉహించని అనుభం ఎదురైంది. ఒక స్టార్ హీరో అభిమాని రాజమౌళి చేసిన ట్విటర్ పై కాస్త ఘాటుగా స్పందించాడు. కానీ తెలివైన మన రాజమౌళి సమయస్పుర్తిగా ఆ ట్విటర్ కు జవాబు ఇచ్చాడు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో రాజమౌళి షాంఘై టూర్ కు సంబందించింది.

 రాజమౌళి తన ట్విటర్ లో పోస్టు చేసిన ఈ ఫోటో పై స్పందిస్తూ ‘నువ్వు తాగావని తెలుసు, ట్విట్ చేయడం ఆపి వెళ్ళి పడుకో’ అంటూ కామెట్ చేస్తే దానికి మన రాజమౌళి స్పందిస్తూ ‘యు ఆర్ రైట్ ఎక్సైట్‌మెంట్‌తో తాగాను. దాని మీనింగ్ ఏమిటో నీకు తెలుసా?నీసూచనలు ఎప్పుడూ స్వీకరిస్తా అంటూ సమాధానం ఇచ్చాడు. షాంఘైలో జరుగుతున్న 16వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలాలో ప్రత్యేక ప్రదర్శనకు రాజమౌళి ‘ఈగ’ ఎంపికైoది.

ఆ ఉత్సవాలలో పాల్గునేందుకు రాజమౌళి చైనా వెళ్ళారు. రాజమౌళి ఈగ ను చైనా లో కూడా విడుదల చేసే ఉదేశ్యం లో ఉన్నట్లు గా తెలుస్తోంది. పనిలో పనిగా రాజమౌళి తాను నిర్మిస్తున్న ‘బాహుబలి’ సినిమా కోసం చైనాలో కొన్ని లోకేషన్స్ కూడా ఎంపిక చేస్తున్నారట. పైకి నిదానంగా కనిపించే ఎంత గట్టివాడో ఈ ట్విటర్ సమాధానం ద్వారా తెలుస్తుంది...



 

మరింత సమాచారం తెలుసుకోండి: