బాణం సినిమాతో అంద‌రినీ ఆక‌ట్టుకొన్నాడు నారా రోహిత్‌. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌కు దూరంగా క‌థ‌ని అల్లుకొని తొలి అడుగులోనే అంద‌రికీ న‌చ్చాడు. సోలోతో అత‌నికి కావ‌ల్సిన క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం కూడా ద‌క్కింది. ఒక్క‌డినే సినిమా నిరాశ ప‌రిచినా.. అత‌ని చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి.

శంక‌ర‌, ల‌వ‌ర్‌, మ‌ద‌రాసీ సినిమాలు ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్నాయి. శంక‌ర పూర్తి కావొచ్చింది. త‌మిళ చిత్రం మౌన‌గురుకి ఇది రీమేక్‌. స్వామి రారా ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌తో జ‌త క‌ట్ట‌బోతున్నాడు.  ఇప్పుడు మ‌రో సినిమాపై సంత‌కం చేశాడు. సుధామూవీస్ సంస్థ  నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. ఈ సినిమాతో ఓ కొత్త ద‌ర్శ‌కుడిని పరిచయం చేయ‌బోతున్నాడు.

��
న‌టుడిగా నారా రోహిత్ ఓకే. అయితే డాన్సులు, ఎమోష‌న్ స‌న్నివేశాల్లో మాత్రం తేలిపోతున్నాడు. ఈ మైన‌స్‌లు అత‌న్ని క‌మ‌ర్షియ‌ల్ హీరో అనే ప‌దానికి దూరం చేస్తున్నాయి. అయినా స‌రే  నిర్మాత‌లు ఈ నారా వారి అబ్బాయి వెనుక ప‌డుతున్నారు. వ‌చ్చే సినిమాల్లో అయినా ఈ మైన‌స్‌ల‌ను దాటుకొస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: