క‌థానాయిక‌ల‌ను ఎంపిక చేసుకోవ‌డం చాలా క‌ష్ట‌మైపోయిందిప్పుడు. కేర‌ళ‌, గోవా, ముంబై ఎక్క‌డికి వెళ్లినా అమ్మాయిలు దొర‌క‌డం లేదు. ముందు హీరోయిన్ ప‌ట్టుకొని ఆ త‌ర‌వాత క‌థ రాసుకోవ‌డం ఉత్త‌మం అనే ఫీలింగ్‌కి వ‌చ్చేశారంతా. బ‌డా బ‌డా క‌థానాయ‌కులకు సైతం హీరోయిన్లు దొర‌క‌డం లేదు. నాని మాత్రం ఓ కొత్త‌మ్మాయిని ప‌ట్టేశాడు. బ్యాండ్ బాజా బారాత్ రీమేక్ కోసం.

బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన‌ బ్యాండ్ బాజా భారత్ సినిమాని యష్ రాజ్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తోంది. రీమేక్ కాబ‌ట్టి.. క‌థ గురించి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేకుండా పోయింది. నానిని ఫొటో షూట్ చేసి ఎంచుకొన్నారు. ఇప్పుడు క‌థానాయిక కూడా దొరికేసింది.

��
 
ఈ సినిమా కోసం ముంబై కి చెందిన మోడ‌ల్‌  వాణి కపూర్ ను ఎంచుకున్నారు. య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ ఎవ‌రిని ఎంచుకొన్నా ఫొటో షూట్ చేస్తారు. వాణిని కూడా అలాగే ఎంచుకొన్నార్ట. నాని-వాణి జోడీ చూడ ముచ్చ‌ట‌గా ఉంటుంద‌ని య‌శ్‌రాజ్ సంస్థ చెబుతోంది. మిగతా నటన వర్గం, సాంకేతిక బృందం గురించి  త్వరలోనే వెల్లడిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: