మారుతికి తెలివితేట‌లు బాగా అబ్బాయి. సినిమాని ఎలా తీస్తాడు...? అందులో బూతులు ఎన్ని ఉంటాయి?  అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే - సినిమాని అమ్ముకోవడం మాత్రం బాగా తెలుసు. ప్రేమ క‌థా చిత్ర‌మ్ కేవ‌లం రెండు
కోట్ల‌తో లాగించేశాడు. ఆ సినిమాకి రూ.8 కోట్ల వర‌కూ బిజినెస్ జ‌రిగింది. మారుతి పేరు మీద‌.. సినిమాల్నిబాగానే అమ్మేస్తున్నాడు. ఇప్పుడు... రొమాన్స్ సినిమా కూడా లాభాల బాట ప‌ట్టించాడు.

బ‌స్‌స్టార్ హీరో ప్రిన్స్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా రొమాన్స్‌. దీనికి మారుతి ద‌ర్శ‌కుడు కాదు గానీ... ఒకానొక నిర్మాణ భాగ‌స్వామి. మారుతి సినిమా అంటే అందులో విష‌యం ఏదో ఉంటుంది అనుకొంటున్నారు బ‌య్య‌ర్లు. ఈరోజుల్లో, బ‌స్‌స్టాప్‌, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌ల‌కు బాగా లాభాలు రావ‌డంతో.. మారుతి సినిమాల్ని కొన‌డానికి బ‌య్య‌ర్లు ఎగ‌బ‌డుతున్నారు.

అది రొమాన్స్ సినిమాకి బాగా క‌లిసొచ్చింది. ఈ సినిమాని కోటిన్న‌ర‌లో తీసి... నాలుగు కోట్ల‌కు అమ్ముకొన్నాడు మారుతి. మారుతి తెలివితేట‌లు చూసి జ‌నాలు అబ్బుర పోతున్నారు. నిజానికి ఈ సినిమా కోసం మారుతి చేసిందేం లేదు. డ‌బ్బులు కూడా పెట్ట‌లేద‌ట‌. కేవ‌లం మారుతి పేరు వాడుకొన్నందుకు వాటా ఇచ్చార‌ట‌. ఈ వ్యాపారం ఏదో బాగుంది క‌దూ.

మరింత సమాచారం తెలుసుకోండి: