ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ అన్నా, ప‌వ‌న్ అన్నా... కొంత‌మందికి ఆట వ‌స్తువ‌గా మారిపోయింది. పవ‌న్‌ని పాజిటివ్‌గా చూపించి కొంత‌మంది హిట్లు కొడుతుంటే - మ‌రి కొంత‌మంది నెగిటీవ్ గా చూపించి.. దాన్నో ప‌బ్లిసిటీ స్టంట్‌గా వాడుకొంటున్నారు. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో ప‌వ‌న్‌పై వేసిన సెటైర్ ఇందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌. ఇప్పుడు అల్ల‌రి న‌రేష్ సినిమా యాక్ష‌న్‌లోనూ ఇదే తంతు న‌డిచింది.

యాక్ష‌న్ సినిమాలోని ఓ కామెడీ స‌న్నివేశంలో - రెండు చింపాంజీల మ‌ధ్య రొమాన్స్ పుట్టించాడు ద‌ర్శ‌కుడు అనిల్ సుంక‌ర‌. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే బ్యాగ్రౌండ్ లో ఓ పాట పెట్టాడు. అది గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలోనిది. ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే.. అనే పాట ప్లే అవుతుంది. అంటే ఓ చింపాంజీ ప‌వ‌న్‌, ఇంకో చింపాంజీ శ్రుతిహాస‌న్ అనా...?!

��
ప‌వ‌న్ నామ జ‌పం చేసి నితిన్ ఇష్క్‌, గుండెజారిగ‌ల్లంత‌య్యిందేలాంటి హిట్టు కొడితే మిగ‌తావాళ్లు... అదే బాట ప‌ట్టారు. అనిల్ సుంక‌ర కూడా ఏదోలా వ‌వ‌న్ పేరు ఈ సినిమాలో లాక్కొచ్చి.. అత‌ని ఇమేజ్‌తో కాసులు రాల్చుకొందాం అనుకొన్నాడు. అయితే ఆ ప్ర‌య‌త్నం బెడ‌సి కొట్టే ప్ర‌మాదంలో ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి: