రాంగోపాల్ వ‌ర్మ....ఒక‌ప్పుడు  ఓ బ్రాండ్. అత‌డు గురించి చెప్పాల‌న్నా....అత‌డి డైరెక్ట్ చేసిన సినిమాల  సంగ‌తి చెప్పాల‌న్నా బుక్స్ రాసేంత మ్యాట‌ర్ వుండేది. అందుకేనేమో   ఆయ‌న చ‌రిత‌ను నా ఇష్టం అంటూ పుస్తకం రూపంలోకి తెచ్చాడు వ‌ర్మ . అయితే ఇపుడు వ‌ర్మ గురించి చెప్పాలంటే......మ్యాట‌ర్ కంటే కాంట‌వ‌ర్సీ ఇష్యూస్ మాత్రం మ‌న‌కు క‌నిపిస్తాయి.  . అందుకేనేమో సిరాశ్రీ వోడ్కా విత్ వ‌ర్మ అని బుక్ రాశాడు. స‌రే ఆ విష‌యం ప‌క్కన పెడితే ఇపుడు వ‌ర్మ అమ్మాయిలంతా చూడాల్సిన సినిమా అంటూ సైకోని ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చాడు.
��
నిజానికి వ‌ర్మ ఆ మాట అనేస‌రికీ  అది నిజ‌మేనా అని డౌట్ వ‌చ్చింది.  మాఫియా, హింస‌, హ‌ర్రర్ , సెక్స్ సినిమాలు తీసే వ‌ర్మ అమ్మాయిల స‌మ‌స్యల‌పై స్పందించి క‌ధ రాశాడు అంటే మ‌హిళాలోకం ఒకింత ఆశ్చర్యానికి గురైంది. అయినా స‌రే కొద్దిమంది కాలేజ్ అమ్మాయిలు సినిమా చూడ‌టానికి ధియేటర్లకు వెళ్లారు. ప్రేమ పీక్ స్టేజికి వెళ్లి  ఓ కుర్రాడు అమ్మాయిని ఎలా ఎరాజ్  మెంట్ చేశాడు అన్న పాయింట్ తో సైకో తెర‌కెక్కింది. ఎండింగ్ లో ఓ చిన్న  సందేశం ఇచ్చి  సినిమా అంతా  నిషా కొఠారి శ‌రీరంలోని బాగాల‌న్ని చూపించ‌డ‌మే స‌రిపోయింది. ఒక 5డి కెమెరా తీసుకోని ఎక్కడ పడితే అక్కడ ప్రేమ్ పెట్టి చూడండి అమ్మాయిల అందాన్ని అన్నట్టు సినిమా తీశాడు ద‌ర్శకుడు. దానికి వ‌ర్మ ప్రజెంటేష‌న్. తొక్కలో ఈ సినిమాకు అమ్మాయిలు రండి అని వ‌ర్మ ఆహ్వనించ‌డం దారుణాతి దార‌ణ‌మ‌ని సినిమా చూసిన వాళ్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: