తెలుగులో ఈగ పేరుతో సినిమాను తీసిన రాజ‌మౌళి సాహ‌సాన్ని అంద‌రూ తెగ మెచ్చుకున్నారు. ఈగ స‌త్తా ఏంటో ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు చూపించింది. అందుకే రాజ‌మౌళిను ఆద‌ర్శంగా తీసుకొని బాలీవుడ్‌లోనూ ఈ ర‌క‌మైన పేర్లు పెట్టడానికి రెడీ అయ్యారు.

జాన్ అబ్రహం త‌న నెక్ట్స్ మూవీ టైటిల్‌ను బ‌నాన అని పెడుతున్నాడు. రీసెంట్‌గా షూట్ అవుట్ ఎట్ ఒదాల మూవీను ఫినిష్ చేసుకున్న జాన్ అబ్రహం, బ‌నాన మూవీను త‌న సొంత ప్రొడ‌క్షన్‌లో ప్రారంభిస్తున్నాడు.

బ‌నాన స్టోరి యూత్ రోమాంటిక్ స్టోరీగా తెర‌కెక్కుతుంద‌ని, ఈ టైటిల్ యూత్‌కు మ‌రింత ద‌గ్గర‌గా తీసుకువెళుతుంద‌ని ప్రెస్‌మీట్లో చెప్పాడు. బ‌నాన మూవీకు సంబంధించిన కాస్టింగ్ ఎంపికా ఇంకా స్టార్ట్ కాలేదు, ఇందులో సోనాక్షి చేత ఐటెం సాంగ్ కోసం ట్రై చేస్తున్నామ‌ని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: