తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా వెలిగిపోయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత అంత గొప్ప స్థానం సంపాదించిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎటాంటి బ్యాగ్ గ్రౌండ్  లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నెంబర్ వన్ హీరో స్థానం సంపాదించిన చిరంజీవి నేటి తరం యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు.  ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఫైట్స్ అంటే బ్రూస్లీ, డ్యాన్స్ అంటే మైకేల్ జాక్సన్ అనేవారు..అయితే ఆ రెండింటిని తనలో ఇమిడ్చుకున్న ఏకైక హీరో మెగాస్టార్.  మాస్, క్లాస్, కామెడీతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి అభిమానుల గుండెల్లో అన్నయ్యగా నిలిచిపోయారు.  
Image result for khaidi no 150 posters
హీరోగా మంచి ఫామ్ లో ఉన్న చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్దమయ్యారు.  తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ‘ఖైదీ నెంబర్ 150’ రిమేక్ చేశారు.  ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా  ‘ఖైదీ నెంబర్ 150’ అవుతుంది.  అయితే చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమాల్లో నటిస్తున్నారు కనుక ఆయన చరిశ్మా తగ్గిందని ఆయన సినిమాలకు పనికిరారని చాలా మంది సెటైర్లు వేశారు..కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత తమఆలోచన మార్చుకున్నారు.  
Image result for khaidi no 150 posters
చిరంజీవి ఇంకా యంగ్ గానే ఉన్నారని డ్యాన్స్, ఫైట్స్ లో తన రేంజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.  ఇక  యూకే అండ్ యు ఏ ఈ సెన్సార్ బోర్డు మెంబర్ ఫిలిం క్రిటిక్ కూడా అయిన ఉమైర్ సందు ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని చూసి తన రివ్యూ ని ఇచ్చారు.   ఈ చిత్రానికి ఆయన 4/5 రేటింగ్ ఇవ్వడమే కాకుండా సినిమా ఫుల్ మాస్, మెసేజ్ ఓరియెటెండ్ సినిమా అని అన్నారు. అంతే కాదు పూర్తిగా పైసా వసూల్ సినిమా అని తెగ పొగిడేస్తున్నారు.   అంతే కాదు అక్కడి పబ్లిక్ టాక్ కూడా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  
Image result for khaidi no 150 posters
సినిమాలో చిరంజీవి వన్ మాన్ షో చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు.  డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్స్ అద్భుతంగా ఉన్నాయని..రెండు పాత్రల్లో చిరంజీవి ప్రాణం పోశారని తెగ పొగిడేస్తున్నారు.  ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది.. ఇక థియేటర్ల వద్ద భారీ ఎత్తున అభిమానులు సందడి చూస్తుంటే సినిమా పై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి.  మరి తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో కొద్ది సేపట్లో తెలిసిపోతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: