మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ఐశ్వర్యారాయ్‌కు మోడ‌లింగ్ మీద ఇంకా మోజు త‌గ్గలేదు. పెళ్ళి చేసుకొని ప్యామిలి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్యారాయ్‌కు త‌న రీ ఎంట్రి పెద్ద క‌న్‌ప్యూజ‌న్‌లో ప‌డింది. అందుకే ఫిల్మ్ కెరీర్‌ను కాసేపు ప‌క్కన పెట్టి తిరిగి మోడ‌లింగ్ వైపు దృష్టిపెడుతుంది.

అందుకే రాంప్ షోల‌తో మ‌ళ్ళీ న‌డ‌క‌ను వ‌య్యారంగా తిప్పాల‌ని ఓ ఫేమ‌స్ ర్యాంప్ షోకు కాల్షీట్ ఇచ్చే ఆలోచ‌న‌లో ఉందంట‌. వ‌చ్చే నెల‌లో లోరెల్ నిర్వహించ‌బోయే గ్రాండ్ ఫ్యాష‌న్ వీక్‌లో ఐశ్వర్యారాయ్ క్యాట్‌వాక్ చేయ‌టానికి రంగం సిద్దంచేసుకుంటుంది.

దీని కోసం ఏకంగా కోటి రూపాయ‌ల వ‌ర‌కు వ‌సూల్ చేస్తుదంని బాలీవుడ్ స‌మాచారం. అందుకే త‌న ఇంటికే ప్యాష‌న్ వేర్ డిజైన్స్‌న తెప్పించుకొని ట్రై చేస్తుంది. అంతేకాకుండా త్వర‌లోనే ఐశ్వర్యా డిజైనెర్ వేర్ అంటూ త‌న సొంత బొటిక్‌ను ప్లాన్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: