తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన నందమూరి బాలకృష్ణ ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు.  తండ్రికి తగ్గ తనయుడిగా పౌరాణిక,జానపద,సాంఘిక చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.  ఇక బాలయ్య 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.  ఈ చిత్రానికి కంచె డైరెక్టర్ క్రిష్ వహిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ నుంచి పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్క విషయంపై అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు చిత్ర యూనిట్.  
Image result for gautamiputra satakarni
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటి చెప్పిన చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణీ.  తల్లి పేరును తన పేరు ముందు ఉంచిన ఖ్యాతి కూడా ఆయనకే దక్కుతుంది. అలాంటి చారిత్మాత్రక చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్శకత్వం వహించారు క్రిష్.   రేపు ప్రపంచ వ్యాప్తంగా ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ రిలీజ్ అవుతుంది.  ఇక బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని అల్లుడు నారా లోకేష్ కూతురు బ్రాహ్మిణి చూసి షాక్ తిన్నారట.  
Image result for gautamiputra satakarni
సినిమా అంత చూసిన తర్వాత నోట మాట రాలేదట..అలా అని సినిమా బాగాలేదు అని కాదు.. సినిమాలో తన తండ్రి విశ్వరూపం చూసి గుండెలు అదిరిపోయాయట..ఇక మామ నటన చూసి అల్లుడు నారా లోకేష్ నోట మాట రాలేదట కొద్ది సేపు షాక్ లో ఉండిపోయారట. సినిమా బాగుంటుంది అని అనుకున్నాం కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారట లోకేష్ బ్రాహ్మిణి లు . ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ అంచనాలతో వస్తున్నారు.    
Image result for gautamiputra satakarni
ఇప్పటికే చిరు నటించిన ఖైదీ చిత్రంపై మంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. మరి రేపు విడుదల కాబోతున్న ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ ఏ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియా శరన్ , హేమా మాలిని నటించగా చిరంతాన్ భట్ సంగీతం అందించాడు కాగా రేపు ఈ సినిమా రిలీజ్ కానుంది .

బ్రహిణి ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: