తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో తన అందచందాలతో ఉర్రూతలూగించిన హాట్ బ్యూటీ రంభ.  దాదాపు పది సంవత్సరాలపాటు ఇటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. తెలుగు ఇండస్ట్రీ అగ్రహీరోలు అందరితో నటించిన రంభ కొంత కాలం క్రితం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  అయితే రంభ వైవాహిక జీవితంలో ఎన్నో వొడిదుడుకులు వచ్చాయి.  కొంత కాలంగా ఆమె భర్తకు దూరంగా ఉంటూ వస్తున్నారు..భర్తతో విభేదాలు రావడమే ఇందుకు కారణం అంటున్నారు రంభ.
Image result for actress rambha family
తన జీవన భృతి కోసం భర్త నుంచి డబ్బు కావాలని కోర్టు ఆశ్రయించింది రంభ. తాజాగా భర్తతో కలిసి జీవించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టు ఆశ్రయించిన సినీ నటి రంభ  కు కోర్టు నోటీసులు జారీ చేసింది. తన వదిన పల్లవిని వేధింపులకు గురి చేసిన కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు.  రంభ సోదరుడు శ్రీనివాసరావుకు 1999లో పల్లవితో వివాహం కాగా, తనను భర్త, అత్తమామలు, ఆడపడుచు రంభ వేధించారని 2014 జూలైలో పల్లవి మూడో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు.
Image result for actress rambha family
కోర్టు ఆదేశాలతో వీరు ముగ్గురిపై ఐపీసీ 498 (ఏ) కింద కేసు నమోదైంది. కాగా అప్పట్లో రంభకు కోర్టు నోటీసులు ఇవ్వాలని చూసినా ఆమె అమెరికాలో ఉంటుండటంతో వీలు కాలేదు. ఇటీవల ఓ టీవీ చానల్ రియాల్టీ షో కోసం ఆమె హైదరాబాద్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు, పద్మాలయా స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో వచ్చి సమన్లు అందించారు. వెంటనే న్యాయస్థానానికి రావాలని ఆదేశించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: