తెలుగు ఇండస్ట్రీలో నటసింహంగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.  ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అయ్యింది.  సినిమా షూటింగ్ మొదలు రిలీజ్ అయ్యేంత వరకు సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగాయి.  ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత గొప్పగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో అలరించిన ఏకైక వ్యక్తి బాలకృష్ణ కావడం విశేషం. ఇక తెలుగు వారి ఆత్మగౌరాన్ని దశదిశలా చాటిచెప్పిన గొప్ప చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణీ.  
Gowthamiputra-review
అలాంటి గొప్ప వ్యక్తి చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ బాలకృష్ణ కెరీర్ లో ఓ మైలు రాయి అవుతుంది. ఈరోజు రిలీజ్ ఐన శాతకర్ణి చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలయ్య అసమాన నటన క్రిష్ దర్శకత్వ ప్రతిభ వెరసి శాతకర్ణి చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందింది. బుధవారమంతా మెగా ఫీవర్‌తో వేడెక్కిపోయిన తెలుగు రాష్ట్రాలు, గురువారం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మాయలో పడిపోయాయి. బాలయ్య సినిమా విడుదలవడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
Related image
విదేశాల్లో కూడా బాలయ్య అభిమానులు ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. శాతకర్ణి రూపకల్పన వెనుక క్రిష్ శ్రమ, పట్టుదలే ఎక్కువగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమ తపన ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. శాతకర్ణి గురించి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. దాంతో ఎవరికి తెలియని కథను, ఎలాంటి వివాదాలు, అభ్యంతరాలకు తావు లేకుండా హీరోయిజాన్ని ఆవిష్కరిస్తూ సినిమాను రూపొందించారు.
Image result for gowthami putra satakarni
క్రిష్ కష్టానికి ఫలితం దక్కిందని అందరూ అంటున్నారు. చిరంతన్ భట్ అందించిన పాటలు బాగున్నాయి అంతకంటే రీ రికార్డింగ్ తో  అదరగొట్టాడు .ఇక బాలయ్య చెబుతున్న డైలాగ్స్ కి థియేటర్ లో క్లాప్స్ మీద క్లాప్స్ పడుతున్నాయి. మొత్తానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: