తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం మెగా, నందమూరి అభిమాను పంట పండిందనే చెప్పాలి.   నందమూరి నటసింహం బాలకృష్ణ తన 100 వ చిత్రంగా చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందించబడిన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’గా అభిమానుల ముందుకు వచ్చారు.   గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం జనవరి 12న రిలీజ్ అయి సంచలన విజయం సాధిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో  బాలయ్య వన్ మిలియన్ డాలర్ల ని దాటేశారు.  

Image result for gautamiputra satakarni photos

తెలుగు వారి రోషం, మీసం మెలేస్తూ ప్రపంచంలో తెలుగు వారి ఖ్యాతి దశదిశలా చాటి చెప్పిన గోప్ప యోధులు గౌతమి పుత్ర శాతకర్ణీ చిత్రంతో నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులు కిన్నులైపోయారు.  బాలయ్య సరసన శ్రియా శరన్ నటించగా తల్లిగా హేమమాలిని నటించింది . రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 13 కోట్ల కు పైగా షేర్ సాధించి భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతోంది.

Image result for gautamiputra satakarni

సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ రెండూ పోటా పోటీగా తలపడుతున్నాయి.  మాస్ ఎంట్రటైన్ మెంట్, మెసేజ్ ఓరియెంటెడ్ తో చిరంజీవి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటి చెప్పిన మహా యోధుడు చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణీ చారిత్రను చాటి చెప్పిన చిత్రంగా బాలయ్య ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రెండు అద్భుత విజయాలు సాధించి మంచి కలెక్షన్లతో రన్ అవుతున్నాయి.  అయితే ఈ పెద్ద సినిమాలకు మరే ఇతర సినిమాలు పోటీలో లేనందున భారీ కలెక్షన్లు సాధిస్తాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

తెలుగు రాష్ట్రాలో ఏరియావైజ్ కలెక్షన్లు :

నైజాం                :  2. 29 కోట్లు  

సీడెడ్                :  2. 77 కోట్లు 

కృష్ణా                 :  1. 06 కోట్లు 

గుంటూరు          :  2. 14 కోట్లు 

ఈస్ట్                  :  1. 25 కోట్లు 

వెస్ట్                  :    1. 73 కోట్లు 

నెల్లూరు           :     77 లక్షలు 

వైజాగ్              :    1. 50 కోట్లు 

 

మొత్తం            : 13. 51 కోట్లు 



మరింత సమాచారం తెలుసుకోండి: