పవన్ త్రివిక్రమ్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే.  పవన్ తీసుకునే కొన్ని నిర్ణయాల వెనుక త్రివిక్రమ్ సలహాలు సూచనలు ఉన్నాయని ఎప్పటి నుంచో వినపడుతున్న మాటలే. ‘అత్తారింటికి దారేది’ తరువాత త్రివిక్రమ్ పవన్ ల సాన్నిహిత్యం మరింత పెరిగింది. 

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ తనకు వస్తున్న ఎన్నో ఆఫర్లను వదులుకుని పవన్ తో సినిమా చేయాలని కోరుకుంటూ పవన్ డేట్స్ గురించి ఎదురు చూస్తున్నాడు. దీనికి తగ్గట్టుగానే 'కాటమరాయుడు' షూటింగ్‌ పూర్తి చేసేసిన వెంటనే త్రివిక్రమ్ పవన్ ల మూవీ పట్టాలు ఎక్కుతుంది అని అనుకున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు అయ్యేలా పవన్ డేట్స్ కూడ ఇచ్చాడు.

అయితే ఈ మూవీ షూటింగ్ మరో నెల వాయిదా పడుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ త్రివిక్రమ్‌ కోసం ఫిబ్రవరి నుంచి ఇచ్చిన తన డేట్స్ కాన్సిల్‌ చేసి మార్చి నుంచి రీ షెడ్యూల్‌ చేసాడనేది తాజా సమాచారం. మార్చి నుంచి ఆరు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చాడట పవన్.

అయితే ఇలా ఈమూవీ మళ్ళీ వాయిదా పడటానికి గల కారణం ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ బిజీకాడు. ఫిబ్రవరితో ‘కాటమరాయుడు’ పనులు పూర్తయిపోతున్నప్పటికీ త్రివిక్రమ్‌ సినిమా కోసం కాస్త బరువు తగ్గి ఫిట్‌గా అయ్యేందుకు పవన్‌ ఈ నెల రోజులు గ్యాప్ ఇస్తున్నాడట. ఒక ప్రొఫెషనల్‌ ట్రెయినర్‌ని హైర్‌ చేసుకుని త్రివిక్రమ్ సినిమాలో గతంలో పవన్ 'జల్సా' చిత్రంలో కనిపించినట్టుగా కనిపించాలని త్రివిక్రమ్‌ అడిగాడని టాక్. అందుచేత పవన్‌ ఒక నెల రోజుల పాటు డైట్‌ ప్లస్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి పెడతాడట. 

‘కాటమరాయుడు’ చిత్రంలో మధ్య వయస్కుడి పాత్ర చేస్తున్నందు వల్ల ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా పవన్‌ కాస్త బరువు పెరిగాడు. ఇదే ఆకృతితో త్రివిక్రమ్‌ చిత్రం చేయడం కుదరదు కనుక షూటింగ్‌ కోసం కొంత సమయం పవన్ అడిగినట్లు తెలుస్తోంది.  దీనితో పవన్ త్రివిక్రమ్ ల సినిమా కేవలం మార్చిలోనే ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. ఈసినిమా ప్రారంభం కాకుండానే ఈసినిమా నిర్మిస్తున్న నిర్మాత రాధాకృష్ణకు బయ్యర్ల నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయి అంటే ఈమూవీ ప్రాజెక్ట్ క్రేజ్ ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: