rajkapoor & his heroines కోసం చిత్ర ఫలితం
జీవిత చరిత్రలు రాసే వారు చాలా మంది తమ జీవితాల్లో జరిగినవి రాసుకున్నా, ఎంతో కొంత సెన్సార్  చేసుకోకుండా నిజమైన చరిత్ర నూటీకి నూరు పాళ్ళూ బయటకు చెప్పలేని పరిస్థితులుంటాయి. దాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఎంత ధమ్మున్నోడైనా తన లోని అసలు కోణాన్ని చూపించుకునే దమ్ము, ధైర్యం, నిజాయతీ, నీతి, ఋజువర్తన దాదాపు ఎవరిలోనూ ఉండదనే చెప్పాలి. అలా కాకుండా కొంటైనా కనీసం కొన్ని విషయాలనైనా ధైర్యంగా చెప్పే ప్రయత్నం కొందరు చేస్తుంటారు. అప్పుడే జీవిత చరిత్రకు సాఫల్యత సిద్ధిస్తుంది. 

rajkapoor & his heroines కోసం చిత్ర ఫలితం

చాలామంది పత్తిత్తులు, పరమ పవితృల మాదిరి, తమ జీవిత చరిత్రని కథల్ని కథలుగా చెప్పుకునే పద్దతిని పక్కన పెట్టి, కొంతలో కొంతఐనా కొన్నింటిలో కొన్నైనా యదార్ధాలను సూటిగా చెప్పుకొచ్చారు నాటి తరం బాలీవుడ్ ప్రముఖ నటులు రిషీకపూర్. "ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్ అన్ సెన్సార్డ్" పేరుతో తన స్వీయచరిత్ర రాసిన ఆయన,  ఇప్పుడు అందరి నోటా నానుతున్నారు. అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాడు. "అండర్ వరల్డ్ డాన్ దావూద్" ను తాను రెండుసార్లు కలిశానన్న విషయాన్ని బహిరంగంగానే సూటిగా చెప్పేశారు. అయితే ఆ చరిత్రంతా ముంబై పేలుళ్లకు ముందే జరిగిందన్న విషయం చెప్పారు.

rajkapoor & his heroines కోసం చిత్ర ఫలితం

తనను దావూదే కలిశాడని చెప్పిన రిషీకపూర్, "తవాయిఫ్ చిత్రంలో తన పాత్ర పేరు దావూద్" కావటంతోనే - ‘డి’ కి తనంటే ఇష్టమని తెలిపారు. దావూద్ భాయ్ తో తనకున్న రిలేషన్ గురించి చెప్పిన  రిషీ తన తండ్రి, ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత రాజ్ కపూర్ జీవితంలోని  అంశాల్ని కాస్త సంచలనం గా చెప్పుకొచ్చారు.

rajkapoor & his heroines కోసం చిత్ర ఫలితం

సినిమాలు, మద్యం, కథానాయికలే తన తండ్రి ప్రపంచమని అలనాటి ప్రముఖ నటీమణులు నర్గీస్, వైజయంతీమాల, మధుబాల, జీనత్ ఆమన్, డింపుల్ కపాడియా, సిమి గ్రేవల్, మందాకిని, పద్మిని తదితర హీరోయిన్లతో తన తండ్రి కున్న సంబంధాల గురించి రాయటంతో ఆయన పుస్తకంపై భారీ చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి తండ్రికున్న "రిలేషన్-షిప్స్" చాటు మాటు విషయాలను రచ్చ రచ్చ చేసిన కొడుకుగా రిషీకపూర్ ఈ తరానికి గుర్తుండిపోతారేమో? బహుశ ఈయనగారి లీలలు ఈయన సుపుతృడు రణబీర్ కపూర్ హరికథగా చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

rishi kapoor dawood ibrahim కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: