త‌మిల్ సూప‌ర్ స్టార్ ఇళ‌య‌ద‌ల‌ప‌తి విజ‌య్ పుట్టిన రోజు సండే ఉండ‌టంతో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అభిమానుల‌ను సంతోష పెట్టాల‌నుకుంటున్నాడు. అందుకే త‌న సంతాషానికి వేధిక‌గా ఇంట‌ర్నెట్‌ను ఎంచుకున్నాడు. అందుకే 15 నిముషాల స‌మయాన్ని అభిమాల‌నుల కోసం కేటాయించాడు.

విజ‌య్‌ లేటెస్ట్ యాక్షన్ కం డ్రా ఫిల్మ్ త‌లైవ ప్రమోష‌న్ స్టార్ట్ అయింది. అంతే కాకుండా రెండు రోజుల ముందుగానే త‌ను న‌టించిన త‌లైవ మూవీ ట్రైల‌ర్‌ను అభిమానుల‌కు కానుక‌గా అందించాడు. ఇప్పుడు త‌న పుట్టిన‌రోజు స‌మ‌యంలో ఓ ప‌దిహేను నిముషాల పాటు ట్విట్టర్లో అభిమానుల కోసం కేటాయించారు.

ఆదివారం రోజున ట్విట్లర్లో అభిమానులు అడిగే ప్రశ్నల‌కు త‌ను నేరుగా ట్వీట్ చేసి, ఆన్సర్ ఇస్తాడంట‌. ఈ విష‌యం తెలుసుకున్న విజ‌య్ అభిమానులు ఆ రోజు ఉద‌యం నుండే ట్విట్టర్లో అభిమాన హీరో ప‌ర్సన‌ల్ లైఫ్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నల‌ను అడిగేందుకు రెడీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: