Gopichand Interview - English

ఎగ్రెసివ్ హీరో   గోపిచంద్ ,  స‌క్సెస్ ఫుల్ డైరెక్టర్   చంద్రశేఖ‌ర్ యేలేటి కాంబినేష‌న్ లో వ‌స్తోన్న భారీ బ‌డ్జెట్ ఫిల్మ్  సాహ‌సం. మొగుడు వ‌చ్చిన  ఒన్ అండ్ ఆఫ్ ఇయ‌ర్ త‌రువాత వ‌స్తోన్న ఈ  సినిమాపై ఇటు ఇండ‌స్ట్రీ,  అటు అభిమానుల్లో భారీ అంచ‌నాలే వున్నాయి. . రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీ సంబంధించి  హీరో గోపిచంద్ తో  ఏపిహెరాల్డ్.కామ్ ఎక్స్ క్లూజివ్ ఇంట‌ర్వూ  మీకోసం.......

ఏపిహెరాల్డ్.కామ్ - హాయ్ గోపిచంద్ బాగున్నారా..? ఏంటి పెళ్లైకా ఇంకా హ్యాండ‌స‌మ్ గా క‌నిపిస్తున్నారు...?

గోపిచంద్ -  అదేంలేదండి. ఇదివ‌ర‌కు లాగానే వున్నా. కాక‌పోతే మీకే అనిపిస్తుంది. .

ఏపిహెరాల్డ్.కామ్ -  అంటే నాకు అలా అనిపిస్తుంది అంటారా?

గోపిచంద్ - న‌వ్వుతూ అదేం కాదు ఈ మ‌ద్య  చాలామంది మీలాగే అన్నారు. ఇంకా హ్యాండ్ స‌మ్ గా అయ్యావ‌ని.

ఏపిహెరాల్డ్.కామ్ - మ‌రి  అంత‌మంది అన్నారు అంటే అది నిజ‌మే అన్నట్టుక‌దా....?

గోపిచంద్ - ఓకే ..పెళ్లైకా కొంచెం   గ్లో వ‌చ్చిందిలెండి. ఒప్పుకుంటాను( న‌వ్వుతూ). 

ఏపిహెరాల్డ్.కామ్ -  సిక్స్ ఫీట్ హైట్ , సిక్స్ ప్యాక్ బాడీ వున్న మిమ్మల్ని చూసి మా గోపిచంద్ హాలీవుడ్ హీరోలా వుంటాడు. హాలీవుడ్ రేంజ్ సినిమాల్లో న‌టిస్తే బాగుండు అంటుంటారు. మీరు నిజంగానే ఇపుడు హాలీవుడ్ రేంజ్ సినిమా చేసిన‌ట్టున్నారు..?

గోపిచంద్ - అవునండి. ట్రైల‌ర్స్ చూసిన‌వారంతా అదే మాట అంటున్నారు. చంద్రశేఖ‌ర్ యేలేటి టేకింగ్, లోకేష‌న్స్ మీకు ఆ అనుభూతిని క‌లిగిస్తాయి. ఐ యామ్ ష్యూర్.. చూశాకే మీరే సూప‌ర్ సినిమా అంటారు.

ఏపిహెరాల్డ్.కామ్ -  షూటింగ్ కోసం ల‌డ‌క్ వెళ్లారు. అది డేంజ‌రస్ ప్లేస్ క‌దా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా..?

గోపిచంద్ - (న‌వ్వుతూ) అక్కడికి వెళ్ళాక తెలిసింది ఎంత డేంజ‌ర‌స్ ప్లేస్ లో షూట్ చేస్తున్నామో?  ఆ ఎడారుల్లో గుర్రాల‌పై స్వారీ...అబ్బో చెప్పాలంటే చాలా స్టోరి అవుతుంది. ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. బ‌ట్ సినిమా ర‌ష్ చూశాక బాద అంతా క్షణాల్లో ఎగిరిపోయింది.

ఏపిహెరాల్డ్.కామ్ - సెకండ్ టైం మీరు చంద్రశేఖ‌ర్ యేలేటితో చేశారు. ఆయ‌న మీ కోసమే ఈ క‌ధ రాసిన‌ట్టున్నారు....?

గోపిచంద్ -  అవును. ఈ క‌ధ నాకు ఒక్కడున్నాడుకు ముందే చెప్పాడు. బ‌ట్ బ‌డ్జెట్ హెవీ అవుతుంద‌ని ఈ క‌ధ‌ను ఒదిలేసి ఒక్కడున్నాడు చేశాం. కానీ శేఖ‌ర్ కి ఎందుకో ఆ క‌ధ‌పైనే గురి. మ‌ద్యలో చాలా సార్లు ప్రాజెక్ట్ చేద్దామా అని అడిగాడు. సాలీడ్ ప్రొడ్యుస‌ర్ దొరికితే చేద్దామని అన్నాను. చివ‌రికీ   దొరికారు  సాలీడ్ ప‌ర్సన్  బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్. అలాగే రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మైన్ మెంట్ భాగ‌స్వామ్యం కూడా దొరికేస‌రికి సినిమాను అద్బుతంగా తీశారు చంద్రశేఖ‌ర్. 

ఏపిహెరాల్డ్.కామ్ - ఓకే మ‌రోసారి తాప్సితో  జోడి క‌ట్టారు. రెండోసారి ఆమెతో న‌టించాల‌ని ఎందుకు అనిపించింది.?

గోపిచంద్ - మొగుడులో ఆల్ రెడీ క‌లిసి న‌టించాంక‌దా.....అప్పుడు అంద‌రూ మా పెయిర్ బాగుంది అన్నారు. అందుకు ఈసారి మ‌ళ్లీ జోడి.

ఏపిహెరాల్డ్.కామ్ - తాప్సీ న‌టించిన సినిమాల్లో ఆమె పాత్రలు చాలా అల్లరిగా వుంటాయి. తాప్సీ బ‌య‌ట కూడా అలాగే వుంటుందా..? 

గోపిచంద్ - బ‌య‌ట ఇంకా అల్లరిగా వుంటుంద‌య్యా బాబూ..షూటింగ్  స్పాట్ లో  తాప్సి వుంటే అంద‌రికీ ఫుల్ జోష్....

ఏపిహెరాల్డ్.కామ్ - మీకు గుర్రపు స్వారి గ‌తంలోనే వ‌చ్చా...లేక ఇపుడు నేర్చుకున్నారా..?

గోపిచంద్ - ఈ సినిమా కోసమే నేర్చుకున్నాను. 

ఏపిహెరాల్డ్.కామ్ - ఓకే.... ఈ సినిమాకు ప‌నిచేసిన కెమెరామెన్  విశ్వరూపం2 కి వ‌ర్క్ చేస్తున్నార‌ట‌క‌దా...?

గోపిచంద్ -  అవును. క‌మ‌ల్ మా సినిమాలోని కొన్ని సీన్స్ చూశారు.  ఫోటోగ్రఫీ సూప‌ర్ అని చెప్పడ‌మే కాదు ఆయ‌న సినిమాకు  కెమెరామెన్ గా పెట్టుకున్నారు. 

ఏపిహెరాల్డ్.కామ్ - ఓ నైస్. ఓకే ఈ సినిమాలో మీరోల్ ఎలా వుంటుంది...?

గోపిచంద్ - నేను  సెక్యూరిటీ గార్డ్ గా క‌నిపిస్తాను. నా పాత్ర చాలా డిఫ‌రెంట్ గా వుంటుంది. నేను ఇక్కడ వుండాల్సిన వాడిని కాదంటూ నేను చేసిన చేష్టలు మీకు కితకిత‌లు పెడ‌తాయి. 

ఏపిహెరాల్డ్.కామ్ -  ఓకే మీ పెళ్లైన త‌రువాత వ‌స్తున్న  సినిమా ఇది. ఆ ప‌రంగా చూస్తే హిట్టేన‌ని చెప్పొచ్చా...?

గోపిచంద్ -  అవును రేష్మా నా జీవితంలోకి వ‌చ్చాక వ‌స్తున్న  ఫ‌స్ట్ ఫిల్మ్ ఇది. హిట్ అవ్వడం ఖాయ‌మ‌న్నన‌మ్మకం వుంది?

ఏపిహెరాల్డ్.కామ్ -  పెళ్లైన త‌రువాత జీవితం ఎలా వుంది.?

గోపిచంద్ - హు....నైస్. చాలా ధ్రిల్ గా వుంది లైఫ్. 

ఏపిహెరాల్డ్.కామ్ -  ఏమైనా మార్పులు వ‌చ్చాయా మీలో..?

గోపిచంద్ - పెద్దగా ఏమీలేవు. బ‌ట్ రేష్మ నా జీవితంలోకి వ‌చ్చాక వంట నేర్చుకున్నాను. త‌నుకు ఇష్టమైన‌వి నేను, నాకు ఇష్టమైన‌వి . త‌ను వండుకుంటాము.

ఏపిహెరాల్డ్.కామ్ - ఆల్ ది బెస్ట్ ..

గోపిచంద్ - ధ్యాంక్యూ.

మరింత సమాచారం తెలుసుకోండి: