పవన్ కళ్యాణ్ ఈమధ్య తనను కలిసిన చేనేత కార్మికుల కష్టాలను చాలా వోపికగా వినడమే కాకుండా వారి సమస్యల పై పోరాటం చేస్తాను అని మాట ఇస్తూ చేననేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాను అని వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో పవన్ తన ‘జనసేన’ పార్టీ కార్య క్రమాల గురించి మాట్లాడుతూ గతంలో ‘ప్రజారాజ్యం’ సమయంలో జరిగిన పొరపాట్లు ఫలితాలు దృష్టిలో వుంచుకునే ఇప్పుడు ‘జనసేన’ పార్టీ నిర్మాణాన్ని ఆచితూచి చేస్తున్నాననే అర్థం వచ్చేలా పవన్ మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పుడు ఇలా ఈవార్తలు బయటకు రావడంతో కొందరు విశ్లేషకులు ఈ వ్యాఖ్యలు వెనుక అర్ధాలను వెతుకుతున్నారు.  ‘జనసేన’ పార్టీ నిర్మాణాన్ని జాగ్రత్తగా చేస్తున్నానని అనడం వేరు ప్రజారాజ్యం వైపల్యాన్ని ప్రస్తావించడం వేరు. పవన్ కళ్యాణ్ ఇలా కావాలనే ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడా లేదంటే చిరంజీవి పవన్ ల మధ్య దూరం పెంచడానికి ఎవరో కావాలని పవన్ అనకపోయినా ఇలాంటి కామెంట్స్ సృష్టించారా ? అన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే  చిరంజీవి ‘ఖైదీ’ మెగా ప్రీ సక్సెస్ మీట్ కు రాకుండా జస్ట్ సాదా సీదా ట్వీట్ తో పవన్ సరిపెట్టడంతో మెగా అభిమానులలోని ఒక ప్రధాన వర్గం పవన్ పై చాల కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థుతులలో పవన్ కళ్యాణ్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడా అంటూ మెగా అభిమానులు కూడ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. 

‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావడంతో కాపు సామాజిక వర్గ యూత్ కు మళ్లీ చిరంజీవిలో ఓ చరిష్మా వున్న నాయకుడు కనిపించాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఏ విషయం పై అయినా వెంటనే స్పందించకుండా తెగ ఆలోచనలు చేస్తూ విలువైన కాలాన్ని వృథా చేస్తున్న పవన్ కన్నా చిరంజీవిని కాపు సామాజిక వర్గ నాయకుడుగా అంగీకరిస్తేనే మంచిది అన్న అభిప్రాయం కొందరిలో ఏర్పడింది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే పవన్ చిరంజీవిల మధ్య దూరాన్ని పెంచే విధంగా ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారు అన్నది మెగా అభిమానుల వాదన..


మరింత సమాచారం తెలుసుకోండి: