బాలకృష్ణ కెరియర్ లో ఇప్పటి వరకు ఏసినిమాకు రానంత భారీ కలక్షన్స్ ను ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రాబడుతూ ఉన్నా బాలయ్య అభిమానులు మాత్రం ఇంకా తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నారు.  దీనికి కారణం కలక్షన్స్ పరుగులో ‘శాతకర్ణి’ - ‘ఖైదీ’ తో సమానంగా పరుగులు తీయలేకపోవడమే.  

ఈ నేపధ్యంలో ఒక కొత్త వివాదం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  దుబాయ్ లో బాలయ్య ‘శాతకర్ణి’ కి అన్యాయం జరిగింది అంటూ ఒక కొత్త వివాదాన్ని బాలయ్య అభిమానులు తెర మీదకు తీసుకు వస్తున్నారు.  తెలుగు సినిమాల‌కు దుబాయ్‌లో పిచ్చ క్రేజ్‌ అన్న విషయం తెలిసిందే. అక్క‌డ కోస్తాంధ్ర నుంచి ఉపాధి కోసం వెళ్ళిన‌వాళ్ళ  సంఖ్య దుబాయ్‌లో చాల ఎక్కువగా ఉంది. 

అందుచేతనే మన స్టార్ హీరోల సినిమాల‌కు అక్క‌డ క‌ళ్లు చెదిరేలా కలక్షన్స్ ద‌క్కుతాయి. ప్రస్తుతం చిరంజీవి ‘ఖైదీ’కి అక్కడ భారీగా వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఈమధ్యలో అన్యాయ‌మైపోయింది బాల‌య్య సినిమా ‘గౌత‌మిపుత్ర శాత‌కర్ణి’ అనీ బాలయ్య అభిమానుల గగ్గోలు.   దీనికి కారణం ఇప్పటి వరకు ‘శాతకర్ణి’ దుబాయ్‌లో లో విడుదల కాలేదు. 

థియేట‌ర్లు దొర‌క‌క పోవడంతో ‘శాతకర్ణి’ విడుదల కాలేదు. ముంద‌స్తుగా అక్క‌డున్న థియేట‌ర్ల‌న్నీ ‘ఖైదీ నెం.150’ కోసం బుక్ చేసేశారు. ఒక్క‌టంటే ఒక్క థియేట‌ర్ కూడా ‘గౌత‌మీపుత్ర‌ శాతకర్ణి’ కి ద‌క్క‌లేదు. వారం రోజుల పాటు అన్ని థియేట‌ర్ల‌న్నీ ‘ఖైదీ’ సినిమా కోసం బ్లాక్ చేశారు. ఇప్పుడు ‘ఖైదీ’ ప్ర‌భావం మెల్లమెల్ల‌గా త‌గ్గిపోవడంతో వచ్చే వారం నుండి ‘శాతకర్ణి’ ని దుబాయ్ లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే దుబాయ్‌లో పైర‌సీ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండటంతో విడుద‌లైన రెండోవ రోజే తెలుగు సినిమాలు మంచి క్వాలిటీతో సీడీలు అక్కడ దొరుకుతాయి.  ఈ ఎఫెక్ట్ ‘గౌత‌మిపుత్ర‌’ పై ప‌డే అవ‌కాశం ఉందని బాలకృష్ణ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు దుబాయ్ లో బాలయ్యకు అన్యాయం జరిగింది అంటూ కామెంట్స్ కూడ చేస్తున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: