టాలీవుడ్‌ను షేక్ చేసి ఎన్నో బ్లాక్ బ‌స్టర్స్‌ను అందించిన ఆసిన్ రీ ఎంట్రి నిర్ణయించుకుంది. ఆ మ‌ధ్య చ‌ర్చలు జ‌రిగి మ‌ళ్ళీ గ్యాప్ రావ‌డంతో, ఈ సారి స్ట్రాంగ్ డెసిషెన్‌ను తీసుకుంది. తెలుగు,త‌మిళ్‌లో రీ ఎంట్రి ఇస్తుంద‌నుకుంటున్న అభిమానుల ఊహ‌కు రివ‌ర్స్‌గా ఓ బాలీవుడ్ మూవీతో మ‌ళ్ళీ రీ ఎంట్రి ఇస్తుంది.

ఆ మ‌ధ్య ఓ ఎన్‌.ఆర్‌.ఐ ల‌వ‌ర్‌తో స‌ర‌సాలు న‌డిపిన ఆసిన్, త‌న‌తోనే మ్యారేజ్ ఫిక్స్ అవ‌కాశం ఉంద‌ని కోళీవుడ్ హాట్ టాపిక్ న‌డిచింది. అంతే కాకుండా ఆసిన్ పేరెంట్స్ కూడ కాబోయో అల్లుడితో మాట్లాడి ఆసిన్ పెళ్లికు ఓ డేట్‌ను ఫిక్స్ చేసుకునేలోపు, ఆసిన్‌కు ఎన్‌.ఆర్‌.ఐకు మ‌న‌స్పర్ధ బేధాలు రావ‌డంతో పెళ్ళి అట‌కెక్కింది. అందుకే ఇప్పుడు రీ ఎంట్రి కోసం భారీగా క‌స‌ర‌త్తులు చేస్తుంది.

త్వర‌లోనే హిందీ మూవీకు సంబంధించి డిటైల్స్‌ను అనౌన్స్ చేయ్యేచ్చేమో అని బి-టౌన్ స‌మాచారం. ఆసిన్ రి-ఎంట్రి ఇస్తే స‌ల్లూభాయ్ స‌క్సెస్ మూవీ రెడీను ఆసిన్‌తో సీక్వెల్ తీసే యోచ‌న‌లో ఉన్నాడు. ఆసిన్ ఎవ‌రితో రి ఎంట్రి ఇస్తుందో అని అంద‌రూ తెగ క్యూరియాసిటితో చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: