ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎక్కడ చూసినా , ఎవరిని కదిపినా ఒకటే టాపిక్ అట. బాలకృష్ణ మారిపోయారు అని. ఆయనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అని ఫిలిం నగర్ సాక్షిగా వినిపిస్తున్న మాట. బాలయ్య ఇదివరకు కథల ఎంపిక చాలా హడావిడి గా సాగేది. ఆయన్ని ఇంప్రెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే వారు. ఈ విషయం లో భోళా శంకరుడు అనే పేరు కూడా ఉంది బాలయ్యకి. ఎప్పుడూ పేరు వినని అనుభవం పెద్దగా లేని డైరెక్టర్ లకి కూడా తన పెద్ద మనసుతో ఓకే చెప్పేస్తూ ఉంటారు బాలయ్య. సింహ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా పడిన తరవాత కూడా పరమవీర చక్ర,అధినాయకుడు, శ్రీమన్నారాయణ… లెజెండ్ లాంటి సూపర్ హిట్ తర్వాత ‘లయిన్’ లాంటి సినిమా చేయడం చూస్తే.. బాలయ్య ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్ధమౌతుంది. అయితే అంత లైట్ మేనర్ లో కధలకు చకచక గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేసే బాలయ్య ఇప్పుడు తన పంధా మార్చుకున్నట్లు కనిపిస్తుంది. 101 వ సినిమా కోసం ఆయన చాలా మంది డైరెక్టర్ లానే లైన్ లో పెట్టారు. అలనాటి మేటి డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి చెప్పిన కథ ఆయనకీ బాగా నచ్చింది కానీ దానికి బాలయ్య నుంచే గ్రీన్ సిగ్నల్ రావడం లేదు అంటున్నారు. ఈ విషయం తో పాటు మరొక మూడు కథల విషయం లో బాలకృష్ణ మల్ల గుల్లాలు పడుతున్నారు, ఒక్కొక్క కథ నీ ఫిల్టర్ చేస్తున్నారు. ఇదివరకు ఆయన పంథా ఇది కాదు. డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఆయనకి అనవసరం. హిట్ లు ఉన్నాయా ఫార్మ్ లో ఉన్నడా అనేవి ఆయనకి అసలు లెక్క లేని వ్యవహారాలు. ఆయనకి కథ నచ్చితే డేట్స్ ఇచ్చేసేవారు. . ఇంకా మంచి కధ కోసం అన్వేషిస్తున్నారట. కధలో ఎంపికలో బాలయ్య లో కనిపిస్తున్న ఈ మార్పు చూసి ఆయన సన్నిహితులు సైతం ఆశ్చర్యపోతున్నార్ట. మీడియా తో కూడా ఎప్పుడూ లేనంత జోవియల్ గా కనిపిస్తున్నారు బాలకృష్ణ. ఇదివరకు ఒకే ఒక రికార్డర్ ఇంటర్వ్యూ తో పని కానిచ్చి అదే అన్ని ఛానల్ వారికీ పంపే వారు ఇప్పుడు శాతకర్ణి విషయం లో అలా కాదు. అటు ప్రింట్, ఇటు ఎలాక్ట్రానిక్ మీడియా ఛానల్స్ అన్నిటితో సరదాగా ముచ్చటిస్తున్నారు బాలయ్య. మీడియా ప్రతినిధులతో తనదైన శైలిలో సరదా కబుర్లు పంచుకుంటూ చాలా జోవియల్ గా కనిపిస్తున్నారాయన. బాలయ్య లో ఇంతటి మార్పుని చూసి అందరికీ ఆశ్చర్యమేస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: