ఒక చిత్రం సామాజిక సమస్యలను వెలికి తీస్తే, మరో చిత్రం ఒక యువకుడిని మెప్పిస్తుంది. ఒక చిత్రం యువతని మెప్పిస్తే, మరో చిత్రం కుటుంబాలను మెప్పిస్తుంది. ఒక చిత్రం చారిత్రక గతిని తవ్వి తీసి దానిని సినిమా రూపంలో తెరపై చూపించి ప్రజలచే ఔరా అనిపించుకుంటుంది. అయితే అన్ని సినిమాల కన్నా ఒక  చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాన్ని నిర్మించడం విశేషం అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి చిత్రమే గౌతమీ పుత్ర శాతకర్ణి.


Image result for krish director

గౌతమిపుత్ర శాతకర్ణిపై చరిత్రకారులు చేస్తున్న విమర్శలపై క్రిష్ ఘాటుగా స్పందించాడు. అసలు గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగువాడు కాదని, శాతవాహనుల్లో ఒకడని, చరిత్రను వక్రీకరించారని పలువురు చరిత్రకారులు అంటున్నారు. కల్పితాలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు గానీ.. అదే చరిత్ర అంటే చూస్తూ ఊరుకోవాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆ సినిమా దర్శకుడు క్రిష్ మండిపడ్డారు. తాను చేసిన ఓ గొప్ప ప్రయత్నాన్ని కించపరిచేలా వారు వ్యవహరిస్తున్నారని... అలాంటి వారి వ్యాఖ్యల పట్ల తాను స్పందించనని అన్నారు. తాను ఏమీ తెలియకుండానే కళ్లు మూసుకుని సినిమా తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.



తెలుగు చక్రవర్తుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒకడని అన్న విశ్వనాథ సత్యనారాయణ కన్నా ఎక్కువ తెలుసా వారికి? పరబ్రహ్మ శాస్త్రిది తప్పుడు వాదన అని వారు చెప్పగలరా? నందమూరి తారకరామారావు కూడా ఆ సినిమా చేయాలని తలపోశారు. నిజంగా తెలుగు వాడు కాకపోతే.. ఎన్టీఆర్ ఆ సినిమా చేయాలని అనుకునేవారా? ఏమీ తెలియకుండానే సినిమా తీశానని అనుకుంటున్నారా? స్క్రిప్ట్ రాసేటప్పుడు 5 పుస్తకాలను చదివాను. వాటిలో 10 రకాలుగా శాతకర్ణి గురించి చెప్పుకొచ్చారు. ఆ పది వర్షన్లన్నింటినీ కలిపి, తాను స్కూలు డేస్ నుంచి శాతకర్ణి గురించి చదువుకున్న దాన్నంతా మిళితం చేసి సినిమా తీశానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: