యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ప్రస్తుతం బాబితో సినిమాకు సిద్ధమయ్యాడు. పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాబి ఆ సినిమా హిట్ అవగా వెంటనే పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ తో ఢీలా పడ్డాడు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు అన్ని తానై నడిపించాడు కాబట్టి బాబికింద ఆ ఫ్లాప్ లెక్కకు రానట్టే. ఇక పవర్ లాంటి పవర్ ఫుల్ హిట్ కోసం తారక్ తో జతకట్టాడు బాబి.


ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ కూడా బాబి సినిమాకు అన్నిటిలోప్ వేలు పెడుతున్నాడట. ఇప్పటికే మ్యూజిక్ డైరక్టర్ దేవిని తన ప్రమేయంతోనే సెలెక్ట్ చేయగా తాజాగా సినిమాకు కెమెరా మన్ గా మురళిధరన్ ను కూడా తారక్ సలహాతో తీసుకున్నారట. అఫ్కోర్స్ కల్యాణ్ రాం నిర్మాత అంటే తారక్ కూడా అందులో ఇన్వాల్వ్ అవడం తప్పులేదు కాని దర్శకుడి సృజనాత్మకతకు సంబందించి అతని మీద తమ అభిప్రాయాలు రుద్దడం వల్ల వారికే ఎఫెక్ట్ పడుతుంది. 


ఇలా చేసే సర్దార్ గబ్బర్ సింగ్ షాక్ తగిలేలా చేసుకున్నాడు పవర్ స్టార్. మరి తారక్ తో చేసే ఈ సినిమా కూడా అలాంటి షాక్ తగలకుండా ఉండాలంటే కచ్చితంగా బాబి డైరక్షన్ లోనే సినిమా రావాలి. అతని టెక్నిషియన్స్ విషయంలో వేలు పెడితే సినిమా రిజల్ట్ కు తను మాత్రం బాధ్యుడు అవడు. ఈ లెక్క సరి చూసుకుని బాబి సినిమాకు తారక్ జాగ్రత్త పడితే మంచింది. లేదంటే సినిమా రిజల్ట్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: