మరో ఎన్నారై బ్యూటి తెలుగు సినిమాలో సందడి చేయబోతోంది. స్టార్ కధానాయకులతో కూడా రోమాన్స్ చేయబోతోంది, అంతేకాదు తాను నటించిన మొదటి సినిమా విడుదల కాకుండానే పెద్దపెద్ద ప్రొడ్యూసర్లు దగ్గర ఎడ్వాన్సులు కూడా పుచ్చేసుకుంటోoది. ఆమె ఎవరో కాదు ‘కిస్’ అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయంకబోతున్న ప్రియా బెనర్జీ.

ఈ ముద్దుగుమ్మ సొంత రాష్ట్రం బెంగాల్. అక్కడ నుంచి వీరి కుటుంబ కెనడా కు ఎప్పుడో  వెళ్ళిపోయింది. అక్కడే పెరిగిన ప్రియా బెనర్జీ కెనడా మిస్ వరల్డ్ గా ఎంపికైంది. స్వతహాగా డాన్సర్ అయిన ప్రియ పలు లైవ్ షో లు చేస్తూ అమెరికాలో కూడా హడావిడి చేసింది. అక్కడే అడివి శేష్ దృష్టిలో పడింది. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన "కిస్" అనే సినిమాలో నాయికగా ఎంపిక అయి ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈమె చేసిన  ఒక్క సినిమా కూడా విడుదల కాకమునుపే ఈ ముద్దుగుమ్మతో పలువురు అగ్ర నిర్మాతలు తమ సినిమాల్లో నటించాలని ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సమాచారం. "కిస్" ప్రచార చిత్రాలు ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి. వాటిలో ప్రియా బెనర్జీ కనిపించిన విధానం చాలా మంది నిర్మాతలను ఆకట్టుకుంటోoది .

ఈ ప్రచార చిత్రాలు చూసిన అనంతరం ప్రముఖ నిర్మాత  దిల్ రాజు తన సంస్థలో ఓ సినిమా చేయాలని ప్రియ బెనర్జీని సంప్రదించినట్టు సమాచారం. ఇప్పటికే అడ్వాన్సులు కూడా ఇచ్చేశాడట. అగ్ర కథానాయకులతో సినిమాలు తీసే దిల్ రాజు ప్రియాని ఎవరి కోసం ఎంపిక చేసుకున్నాడన్నది టాప్ సీక్రెట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: