తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరో కం డైరెక్ట‌ర్ తన సత్తాచాటాడు రాఘవ లారెన్స్. హర్రర్,థ్రిల్లర్,కామెడీ కాన్సెప్ట్ తో ముని సినిమా తీశాడు..ఈ సినిమా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుత విజయం సాధించింది. దీంతో ముని సీక్వెల్ కాంచన, గంగ సిరీస్‌తో చ‌క్క‌ని ఫ‌లితాలు అందుకున్నాడు.  గంగ సినిమా తర్వాత లారెన్స్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. టీవ‌లి కాలంలో లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలేవీ రావ‌డం లేదు.  
Image result for lawrence shivalinga
చాలా కాలం గ్యాప్ తర్వాత లారెన్స్  న‌టించిన ‘శివ‌లింగ‌’ రిలీజ్ కి సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమా కన్నడంలో రాజ్ కుమార్ ‘శివలింగ’ తెలుగు లో రిమేక్ చేస్తున్నారు. అయితే టైటిల్ కూడా ‘శివలింగ’ కావడం విశేషం.  పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో భారీ బడ్జెట్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించిన ‘శివలింగ’ కన్నడంలో బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది.  
Image result for lawrence shivalinga
ఈ చిత్రంలో లారెన్స్ సరసన రితిక హీరోయిన్‌ గా నటించింది.   జ‌న‌వ‌రి 23 సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హార్రర్ కాన్సెప్ట్‌ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్‌లో ఉండే చిత్రమని చెబుతున్నారు. మ‌రి ఈ రీమేక్ సినిమాతో లారెన్స్ హీరోగా స‌త్తా చాటుకుంటాడా? అనేది వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: