అదేంటో గాని దేని కిందకొ 30 ఏళ్ళు వస్తేనే ముసలివాళ్ళుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో 80 ఏళ్ళ లో కూడా ఇంకా పడుచు హీరోయిన్లతో తైతక్కలాడాలని ఉన్నట్లుగా అక్కినేని నాగేశ్వర రావు చెబుతుంటాడు. తమ వంశం హీరోల మూవీ వేడుకల్లో కనిపించే ఈ 80 ఏళ్ళ యువకుడికి అమ్మయిలే కాకుండా మరో పిచ్చి కూడా ఉంది. అదే వంశం పిచ్చి.


ఇప్పటి వరకు మెగా, నందమూరి ఫ్యామిలీ హీరోలే ఈ పిచ్చకి పరాకాష్ట అనుకుంటుంటే, ఇందులో తమ ఫ్యామిలీ లేనందుకు గర్వించాల్సింది పోయి అందులోనే చేర్చాలని ప్రయత్నిస్తుండటం నిజంగా అక్కినేనికి ఈ పిచ్చ ఎంటిరా బాబోయ్ అని మనకు అనిపించక మానదు. అయినా ఏం చూసుకొని నాగేశ్వర రావు గారు తమ వంశాన్ని పొగుడు కుంటున్నాడో? పట్టుమని 25 కోట్లు రాబట్ట గలిగే హీరో అయితే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో లేనేలేడు.


అలాంటిది మా వంశం అలాంటిది కాదు, మాకు ఆ అలవాటు లేదు అంటూ ఈ అక్కినేని ఎవరినో చూపించే ప్రయత్నం ఇకపై మానుకుంటే మంచిది. తాజాగా జరిగిన అడ్డా ఆడియో ఫంక్షన్లో కూడా అక్కినేని వంశం, ఫ్యామిలీ అంటూ డైలాగ్స్ పేల్చాడు. కష్ట పడితేనే ఇక్కడ సక్సెస్సులు వస్తాయి అంటూ డైలాగ్ పేల్చిన ఏయన్ఆర్, మరి తమ కుర్ర హీరోలకు ఇంతకాలం విజయం ఎందుకు రాలేదో వివరించలేదు. ఓపెనింగ్స్ తోనే నిర్మాతలకు సగం సొమ్ము తెచ్చిపెడుతున్న ఫ్యామిలీ హీరోలతో పోల్చేకంటే తమ ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసుకొని, ఆ స్టేజీలో నిలబెట్టే హీరో తమ వంశం నుండి వచ్చాక ఇటువంటి డైలాగ్స్ పేల్చితే బాగుంటుంది. అప్పటి వరకు కాస్త సైలెంటుగా ఉండవయ్యా ప్రేమనగర్ దసరా బుల్లోడా!

మరింత సమాచారం తెలుసుకోండి: