ప్రస్తుతం టాలీవుడ్ బడా బడ్జెట్ సినిమాలు అన్నింటిలోను అనుష్కే హీరోయిన్ ‘బాహుబలి’, ‘రాణి రుద్రమ్మ’ లాంటి తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ లో కూడా పెద్దపెద్ద సినిమాలు చేస్తోంది ఈ యోగా బ్యూటి. అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్లో ఈమె పారితోషికం కోట్ల పైనే ఉంది. అటువంటి అనుష్కకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది.

ఆ మధ్య  అనుష్క  రాజమౌళి 'బాహుబలి' సినిమా కోసం  కత్తి ఫైట్లు, గుర్రపుస్వారీలు నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన వెంటనే బయటకు వెళ్ళిపోయేదట అనుష్క. ఓ  కారులో  వచ్చిన ఓ వ్యక్తి , ఆమెను బయటకు తీసుకు వెళ్ళేవాడట అయితే అతను మాత్రం కారు దిగి  బయటకు రాకుండా జాగ్రత్తపడేవాడని తెలిసింది. ఈ నేపధ్యంలో ఆమెకు ఎన్‌ఆర్‌ఐ బిజినెస్‌మేన్‌తో  స్నేహం ఏర్పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

గుర్రపుస్వారీ, కత్తిసాములు నేర్చుకున్నాక చిన్నపాటి ఆరోగ్యటిప్స్‌ను కూడా అమెరికా వైద్యుని పర్యవేక్షణలో అనుష్క జాగ్రత్తల తీసుకుంటోoదట. ఇదంతా ఆ ఎన్‌ఆర్‌ఐనే ఏర్పాటు చేసినట్లు చెపుతున్నారు . ఏ షూటింగ్‌లో ఉన్నా సాయంత్రం అయితే చాలు ఆమె వీడియో చాటింగ్ చేస్తోందని చిత్ర యూనిట్ వారు అంటున్నారు. మరి ఇంతకీ ఈ జేజమ్మ మనస్సును దోచుకున్న అజ్ఞాత ప్రేమికుడు ఎవరో తెలియాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: