బన్నీ డాన్స్ లు అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరు అమ్మాయిలలో సినిమా జయాపజయాలతో సంబందం లేకుండా క్రేజ్ ను పెంచుకుంటున్న హీరో అల్లుఅర్జున్. అటువంటి బన్నీని ఓ మలయాళీ బ్యూటి  విపరీతంగా అభిమానిస్తోంది. ఆమె హీరోయిన్ కాక ముందు నుంచి బన్నీకి వీరాభిమాని.

ఆమె ఎవరో కాదు, ‘జర్నీ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనన్య. ఆమె హీరోయిన్ కాక ముందే తన స్నేహితులతో కలిసి కేరళ  నుండి ప్రత్యేకoగా హైదరాబాద్ వచ్చి బన్నీని కలిసేదట. ప్రస్తుతం హీరోయిన్ అయ్యాక తాను కలవలేకపోతున్నా తాను మాత్రం ఇప్పటికీ బన్నీ వీరాభిమానిని అని చెపుతోంది అనన్య.

 ప్రస్తుతం ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమాతో పాటు మరో పది సినిమాలలో  నటిస్తూ బిజీగా ఉంటోoది అనన్య. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా తన దృష్టి మాత్రం త్వరలో విడుదల కాబోతున్న రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమా పైనే ఉందనీ ఆ సినిమా టాలీవుడ్ లో హిట్ అయితే తన అభిమాని హీరో బన్నీ తో తెలుగుసినిమాలలో నటించే అవకాశం వస్తుందనీ ఆశపడుతోంది అనన్య. మలయాళ సినిమా రంగంలో అక్కడ ప్రేక్షకులచే మల్లు అర్జున్ గా ముద్దుగా పిలిపించుకునే మన బన్నీ అనన్య కోరిక ఎప్పుడు తీరుస్తారో మరి....

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: