అచ్చమైన తెలుగమ్మాయి బిందుమాధవి కి టాలీవుడ్ కలిసిరాలేదు. ‘ఆవకాయ్ బిరియాని’, ‘బంపర్ ఆఫర్’ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మురిపిద్దామని తన అందాలు ఆరబోసిన తెలుగు ప్రేక్షకులు తెలుగు నిర్మాతలు కనికరించలేదు. దీంతో బిందు తన రూట్ మార్చి కోలీవుడ్ వైపు వెళ్ళింది. అయితే అక్కడ మాత్రం అదృష్టం కలిసి వచ్చి కోలీవుడ్ లో మాత్రం యమ క్లిక్ అయ్యింది. వరసగా అవకాశాలను అంది పుచ్చుకుంటోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూనే, అప్పుడప్పుడు అందాలు కూడా ఆరబోస్తోంది. ప్రస్తుతం "దేశింగు రాజా" అనే సినిమాలో నటిస్తోంది.

ఇందులో బిందు అందాలు విచ్చలవిడిగా ఆరబోసిందట. ఇకపై కూడా తమిళ ప్రేక్షకులకు మరింత ఘాటుగా అందాలు వడ్డించాలని నిరంయించుకుందట. అంతేకాదు తనకు అందంగా కనిపించడం అంటే చాలా ఇష్టమని ఈ విషయంలో తను సిల్క్ స్మితను ఆదర్శంగా తీసుకుంటానని బిందుమాధవి చెపుతోంది. దీనికి ప్రధానకారణం ఆమె చూపులు అచ్చు సిల్క్ స్మితలా ఉంటాయని తన చిన్న  తనంలో చాలా మంది చెప్పేవారట.   

సిల్క్ నా స్పూర్తి అంటోoది, అంతేకాదు ఆమెలా నటించి తెరపై కవ్విస్తుందట కూడా. అన్నీ బాగున్నాయి కానీ జీవితం మటుకూ సిల్క్ స్మితలా ముగింపు కాకూడదని బిందుమాధవి గ్రహిస్తే బాగుంటుంది.....

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: