వుయ్ వాంట్ బ్యాడ్ బోయ్స్ అంటూ – బిజినెస్‌మేన్‌లోమహేష్ బాబు ఎదుట అందమంతా ఒలకపోసిన శ్వేతా భరద్వాజ్ నిన్న సుసేంత్ హీరోగా నటిస్తున్న అడ్డా సినిమా ఆడియో వేడుకలో నానా  హంగామా చేసింది.. శ్వేతా భ‌ర‌ద్వాజ్‌. ఇప్పుడు అడ్డాలోనూ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చిందులు వేస్తూ కనిపించబోతోంది. నిన్న అక్కినేని కుటుంబ హీరోలంతా ఒకే చోట కనిపించి అభిమానులకు కనువిందు చేసిన అడ్డా వేడుకలో  కెమెరా ముందే కాదు తాను ఐటమ్ సాంగ్స్ ను లైవ్ గా వచ్చిన జనాలను రెచ్చ కొడుతూ శ్వేతా చేసిన డాన్స్ ను చూసి అది ఆడియో వేడుకా లేక రికార్డింగ్ డాన్స్ అని కొంతమంది ఫీల్ అయ్యారు.

అక్కినేని సాక్షిగా జరిగిన ఈ లైవ్ పర్ఫామిన్స్ లో అక్కినేనితో పాటు ఆయన వంశ హీరోలంతా కూర్చుని ఆనందించడం చూస్తే మన తెలుగు సినిమా ఎస్థితికి దిగాజరిపోతోందో అర్ధం అయిపోతోంది. కోట్ల పారితోషికాలు,  ఓపినింగ్ కలెక్షన్స్ ప్రధాన లక్షంగా సినిమాలు తీస్తున్నారు. ఈ ఆడియో వేడుకలో డాన్స్ చేసిన  శ్వేతా భరద్వాజ్ ‘అడ్డా’ సినిమాలో ఎరేంజ్ లో చేసిందో తెలియదుగానీ స్టేజ్ పై మాత్రం ఒక ఊపు ఊపింది. ఆమె చేసిన‌ ఎక్స్‌పోజింగ్… ఓ రేంజ్‌లో ఉంది. మరి తెర‌పై ఎంత మ‌సాలా ద‌ట్టించిందో చూడాలి …? డాన్స్ చేయ‌డం ఒక్కటే కాదు, వేదిక‌పై యాంక‌ర్ అవ‌తారం ఎత్తి, నాగార్జున‌ని ఓ మినీ ఇంట‌ర్వ్యూ కూడా చేసింది.

ఇవ్వన్నీ చూసిన మన అక్కినేని అభిమానులు ఒక కంటితో శ్వేత అందాలు మరో కంటితో అక్కినేని హీరోల టోటల్ గ్రూప్ ను  వేదిక పై చూసుకుని  ఆనందంతో గడిపెసారు. సుశాంత్ అడ్డా సినిమా ఏమేరకు హిట్ అవుతుందో తెలియదు కానీ నిన్న మాత్రం అక్కినేని వారి ఇంట పండుగే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: