సీన్ డిమాండ్ చేస్తే లిప్ లాక్ టు బికిని దేనికైనా రెడీ అని చెప్పే హీరోయిన్స్ లిస్ట్ లో లెటెస్ట్ గా రాద కూతురు కార్తీక కూడా చేరిపోయింది. చెప్పడ‌మే కాదు సెమీ న్యూడ్ గా ప‌రుగులు పెట్టింది. నిజానికి ఇపుడు ఇదే టాక్ ఆఫ్ ది కోలీవుడ్. అస‌లే ఐదున్నర అడుగులు వుంటుంది. కాస్త మందంగానూ వుంటుంది కార్తీక . మ‌రి అలాంటి బ్యూటీ న‌గ్నంగా ప‌రుగులు పెడితే ఏమౌతుంది . సెన్సేష‌న్ అవుతుంది. ఇపుడు అదే జ‌రిగింది కార్తీక విష‌యంలో.

నాగ‌చైత‌న్యకు జోడిగా జోష్ తో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన కార్తీక ఫ‌స్ట్ సినిమాతో ప్లాప్ ఎదుర్కోంది. ఆ త‌రువాత రంగంతో హిట్ కొట్టిన ఈ సుంద‌రి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి జ‌త‌గా ద‌మ్ములోనూ మెరిసింది. వాస్తవానికి ద‌మ్ము త‌న ఫేట్ ని మార్చేస్తుంద‌ని కార్తీక ఆశించింది. కానీ కెరీర్ కి బూస్ట్ ఇవ్వాల్సింది పోయి ద‌మ్ములో ఎన్టీఆర్ కి అక్కలా వుంద‌నే కామెంట్స్ విన‌ప‌డ్డాయి. ఆ త‌రువాత తెలుగు సినిమాల‌కు బైబై చెప్పేసి కాన్సట్రేష‌న్ అంతా కోలీవుడ్ పైనే పెట్టింది కార్తీక‌.

ప్రస్తుతం బారతీరాజా డైరెక్షన్ లో అన్నకోడి అనే ఫిల్మ్ చేసింది. ల‌క్ష్మణ్ నారాయ‌న్ కి జోడిగా కార్తీక న‌టించిన ఈ సినిమా జూలై సెకండ్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మ‌ద్య రిలీజైన అన్నకోడి ఆడియో సాంగ్స్ సూప‌ర్ హిట్ అవ్వడంతో న్యూ ట్రైల‌ర్స్ రిలీజ్ చేశారు. ఒక టీజ‌ర్ లో కార్తీక వెనుక‌బాగంలో ఏ ఆఛ్చాద‌న లేకుండా పరుగులు తీస్తూ వుంటుంది. ఇపుడు ఇదే కోలీవుడ్ కుర్రకారుని ఫుల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. మ‌రి ఆఫ‌ర్లు లేన‌ప్పుడు అందాల ఆర‌బోత తప్పద‌న్న సూత్రాన్ని పాటించిన కార్తీక ఈ సినిమా రిలీజ్ త‌రువాత అయినా ఓ రెండు ఆఫ‌ర్లు అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: