లవర్ బోయ్ ఇమేజ్ తో లాస్ట్ ఇయర్ ప్రేమం. సాహసం శ్వాసగా సాగిపో హిట్స్ తో మళ్లీ ఫాంలోకి వచ్చిన నాగ చైతన్య ప్రస్తుత్మ సోగ్గాడే చిన్ని నాయనా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ రెండు హిట్లు పడినా సరే చైతు మార్కెట్ దృష్టిలో పెట్టుకుని నాగార్జున పెట్టుబడి పెడుతున్నారట. పక్కా మార్కెట్ ప్లానింగ్ తోనే చైతు సినిమా తీస్తున్నట్టు టాక్.

 

టాలెంట్ ఎంత ప్రోత్సహిస్తాడో అదే విధంగా కమర్షియల్ లెక్కల్లో కూడా నాగార్జున తన మార్క్ చూపిస్తారు. ముఖ్యంగా సినిమా బడ్జెట్ కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే చేయబోతున్న కళ్యాణ్ కృష్ణ డైరక్షన్లో చైతు మూవీ కోసం లిమిటెడ్ బడ్జెట్ కేటాయించాడట. బడ్జెట్ పరిమితుల్లోనే సినిమా పూర్తి చేయాలని చెప్పాడట. ఎలాగు సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తీసి హిట్ కొట్టాడు కాబట్టి ఆల్రెడీ నాగార్జునకు ట్యూన్ అయిన కళ్యాణ్ కృష్ణ సినిమా షురూ చేశాడు.

 

తనయుడైనా సరే నాగార్జున వేసిన ఈ మెగా ప్లాన్ తెలిసిన వారు షాక్ అవుతున్నారు. ఇక నాగ్ కూడా ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు అఖిల్ చేసే సెకండ్ మూవీ విక్రం డైరక్షన్ లో కూడా నాగార్జున నిర్మాణంలోనే వస్తుంది. సో తనయులకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టడం కోసం నాగ్ తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: