సొట్ట బుగ్గలతో, గమ్మత్తైన నవ్వుతో కుర్రకారుని మంత్రముగ్ధం చేసే అందాల తాప్సీ ని హీరో గోపి చంద్ రెండేళ్ళు భరించాడట  ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఢిల్లీ సుందరి తాప్సీ ,  గోపీచంద్‌కి జోడీగా ఈ అమ్మడు నటించిన ‘సాహసం’ ఈ నెల 28న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ శుభసందర్భాన తాప్సీ ఓ మాట చెప్పింది. గోపి నన్ను రెండేళ్లు భరించాడని అసలు లోగుట్టు విప్పేసింది.  ‘మొగుడు’ సినిమాతో ఈ జోడీ ప్రయాణం మొదలైంది. అది సాహసం చేసేంతవరకూ వచ్చింది. అయితే ఈ సాహసం ఇద్దరికీ కలిసొస్తుందో లేదో తెలీదు కానీ, ఇప్పటికైతే ఇద్దరికీ ఈ సినిమా విజయం  చాలా  అవసరం  తాప్సీ అరడజను సినిమాల్లో నటించేసినా, ఇంతవరకూ ఒక్క హిట్టూ కొట్టలేదు.

గోపీ కూడా వాంటెడ్‌ లాంటి అట్టర్‌ప్లాప్‌తో డీలాపడిపోయాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ గట్టెక్కించే సినిమా  కావాలి  అందుకే వారిద్దరి దృష్టి సాహసం ఫై ఉంది. హిట్టు మాట అటుంచితే..అసలు గోపీ రెండేళ్లు తనని భరించాడనడంలో తాప్సీ  అర్థమేమిటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంటే  ఈ ఇద్దరూ ఈ రెండేళ్ళు కలిసి ఉన్నారనా  లేక మొగుడు సినిమా పూర్తయి సాహసం రిలీజ్‌కొచ్చేసరికి రెండేళ్లు దాటేసిందనా?

 తాప్సీ ఉద్ధేశమేదైనా...గాసిప్‌రాయుళ్లకు మాత్రం బోలెడు మేటర్ దొరికి ఎవరి కధలు వాళ్ళు రాసేసి కుంటున్నారు...   

మరింత సమాచారం తెలుసుకోండి: