జిస్మ్ 2 తో బాలీవుడ్ కుర్రకారు హార్ట్ బీట్ పెంచిన హీరోయిన్ స‌న్నిలియోన్. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గర బోల్తా కొట్టిన‌ప్పటికీ ఈ పోర్న్ బేబీకి మాత్రం భీభ‌త్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ సినిమా త‌రువాత షూట‌వుట్ ఎట్ వాలాలో జాన్ స‌ర‌స‌న ఐటం సాంగ్ లో చిందేసింది. సంజ‌య్ గుప్తా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లైలా తేరి లే లేగి అంటూ ఈ ముద్దుగుమ్మ త‌న అందంతో కిర్రెక్కించేసింది.

ఆ ఐటం సాంగ్ బాక్సాఫీస్ ద‌గ్గర లక్ష్మీ బాంబ్ లా పేల‌డంతో స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌మ‌ని వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయి స‌న్నికి. అయితే సన్నిలియోన్ మాత్రం హీరోయిన్ గా మాత్రమే చేస్తాన‌ని ఐటం సాంగ్స్ లో ఆడ‌టానికి పుల్ స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం రాగిణి ఎంఎంఎస్ సీక్వెల్ లో న‌టిస్తున్న ఈ హాట్ బేబీ మ‌రో సూప‌ర్ ఛాన్స్ కొట్టేసింది. కైజాద్ గుస్తాద్ డైరెక్షన్ లో ఓ భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న చిత్రం లో స‌న్నినే క‌ధానాయిక‌గా ఎంపికైంది. ఈ సినిమా క‌ధ స‌న్నిలియోన్ రియ‌ల్ లైఫ్ కి ద‌గ్గర‌గా వుంటుంద‌ట‌. దీంతో కొద్దిమంది సన్ని జీవిత క‌ధ‌నే తెర‌కెక్కిస్తున్నార‌ని అంటున్నారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో స‌న్నిలియోన్ భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్ కూడా న‌టించ‌నున్నాడ‌ట‌.

ప్రస్తుతం ఓ ఆల్బమ్ రూపొందిస్తూ...మ్యూజిక్ షోల‌తో యమా బిజీగా వున్న డేనియ‌ల్ ఈ విష‌యం తెలియ‌గానే ఫుల్ హ్యాపిగా ఫీల‌య్యాడ‌ట‌. నిజం చెప్పాలంటే డేనియ‌ర్ కాదు బిటౌన్ ఆడియెన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స‌న్నిలియోన్ సినిమా అంటేనే రోమాంటిక్ పిల్మ్. ఇక భ‌ర్తతో క‌ల‌సి న‌టించ‌మంటే రోమాన్స్ సీన్స్ కి అడ్డు అదుపు వుంటుందా ...తెర‌పై వేడిరాజుకుంటుంది...మాకు క‌న్నుల పండుగే అంటున్నారు బిటౌన్ ఆడియెన్స్. అంతేకాదు పూరి జ‌గ‌న్నాద్ అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి స్టైల్లో ఆమె ..ఆయ‌న‌..ఓ సినిమా అని సినిమాకు టైటిల్ పెడితే బాగుంద‌ని కొద్దిమంది అభిప్రాయ ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: