న‌రేష్ టైటిళ్ల వెరైటీ ప‌ర్వం కొన‌సాగుతుంది. టైటిల్ తోనే స‌గం విజ‌యం సాధించే హీరో ఆయ‌న‌. అత్తిలి స‌త్తిబాబు ఎల్కేజీ, క‌త్తి కాంతారావ్‌, సీమ ట‌పాకాయ్‌, సుడిగాడు... ఇలా న‌రేష్ హ్యుమ‌ర్ ట‌చ్ ఉన్న టైటిళ్లే సెలెక్ట్ చేసుకొంటాడు. ఆ జాబితాలో మ‌రో పేరు చేరింది. అదే ల‌డ్డూ బాబు.
అల్ల‌రి.... న‌టుడిగా న‌రేష్‌, ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని సినిమా. చిన్న చిత్రాలు క్వాలిటీగా తీయొచ్చ‌ని నిరూపించింది అల్ల‌రి సినిమానే. ఇప్పుడు న‌రేష్‌-ర‌విబాబు మ‌రోసారి జ‌త క‌ట్ట‌నున్నారు. ఈ సినిమా టైటిల్ అల్ల‌రి 2 అనుకొన్నారంతా. కానీ... అది కాద‌ట‌. ఈ అల్ల‌రోడి సినిమాకి... ల‌డ్డూ బాబూ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

��

ఇటీవ‌లే ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్లునుంది. ఇందులో ఓ కీల‌క పాత్ర కోసం భూమిక‌ను ఎంచుకొన్న‌ట్టు స‌మాచార‌మ్. న‌రేష్ రెండు ర‌కాల గెట‌ప్పుల్లో క‌నిపిస్తాడ‌ట‌. అల్ల‌రిలానే.. మీసాల్లేకుండా క‌నిపిస్తాడ‌ట. క‌థానాయిక‌- మిగిలిన సాంకేతిక వ‌ర్గం వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: