యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓడి గెలిచిన హీరో.. తన ఫ్యాన్స్ ఎంత అభిమానిస్తున్నా సరే వారికి తగ్గ సినిమాలు ఇవ్వలేనట్టుగా కొద్దిరోజులు కన్ ఫ్యూజన్ లో ఉన్న తారక్ అటు ఫ్యాన్స్ కు ఆకలి తీరే సినిమా తీసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. నూనూగు మీసాల వయసులోనే కలక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన తారక్ ఎంత పెద్ద స్టార్ అయ్యడో మధ్యలో అంతే వెనక్కి తగ్గినట్టు కనిపించాడు.   

 

అయితే మళ్లీ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ హిట్లతో పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. తారక్ మార్క్ హిట్ కొడితే కలక్షన్స్ ఎలా ఉంటాయో గ్యారేజ్ చూపించింది. అయితే కెరియర్ లో స్టార్ స్టేటస్ రావడం ఆ తర్వాత ఫ్లాపులు రావడం ఇలా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు లేదా తీవ్ర మైన ఒత్తిడిలో ఉన్నప్పుడు తారక్ ఏం చేస్తాడు అన్నది ఫ్యాన్స్ తెలుసుకోవాలని అనుకుంటారు.

 

తనకు ఎప్పుడు డిప్రెషన్ గా అనిపించినా సరే వంట చేస్తానని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు తారక్. తనకు ఒంట చేయడం ఇష్టమన్న తారక్ తను వంట చేసేప్పుడు కూడా చాలా కాన్సెంట్రేషన్ తో చేస్తాడని అంటున్నారు. తనలోని ఒత్తిడిని అలా అధిగమించి మళ్లీ తనకు తానే రిఫ్రెష్ మెంట్ అవుతాడట తారక్. జూనియర్ లోని ఈ హిడెన్ టాలెంట్ అందరికి తెలియకపోవచ్చు కాని తారక్ స్వయం పాకం న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ న్యూస్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: