ఎంతో క‌ష్టప‌డి...ఆడియెన్స్ ని ధ్రిల్ చేయాల‌ని సినిమా వాళ్లు ఏదో చేస్తారు . ఇంత‌లో ఎవ‌రో అది నెట్ లో కి వ‌దులుతారు. అలా ఎంత క‌ష్టప‌డిన ఏ విష‌యమైనా లీక్ అయితే ఎక్కడో కాలుతుందిక‌దా...కానీ ప్రియాంక చోప్రా కూల్ గా కోపాన్ని అణుచుకుంటుంది. ఇంత‌కీ ప్రియాంక‌కు ఎందుకు కోపం..? లీకైంది ఏంటి...?క‌కోపాన్ని అణుచుకోవడం ఏంటి...? మాకు తెలియాలి అంటారా..? ఓకే ఆ విష‌యానికొస్తున్నా.

ఇన్ మై సిటి త‌రువాత ప్రియాంక చోప్రా చేస్తోన్న రెండో నెంబ‌ర్ ఎక్సోటిక్. హిందీ, ఇంగ్లీష్ లిరిక్స్ తో సాగే ఈ ట్రాక్ రేపు రిలీజ్ కావాల్సి వుంది. కానీ ఈ రోజు నెట్ లోకి ఆ సాంగ్ వ‌చ్చేసింది. విష‌యం తెలిసినా ప్రియాంకకు పిచ్చి కోపం వ‌చ్చింది. కాసేపు మూడీగా కూర్చున్న ప్రియాంక ఆ త‌రువాత కూల్ అయింది. అవ్వడ‌మే కాక లీకైన సాంగ్ ని ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. అమెరిక‌న్ ర్యాప‌ర్ పిట్ బుల్ తో చోప్రా చేస్తోన్న ఎక్సోటిక్ ట్రాక్ ఇప్పటికే నెట్ లో దుమ్మురేపుతోంది. ఇన్ మై సిటి త‌రువాత చేస్తోన్న ఈ ఆల్బం త‌న‌కి ఎంతో ఫేమ్ తెచ్చిపెడుతుంద‌ని ప్రియాంక భావిస్తోంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: