మొగుడిలా ఉన్నావంటే - మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయ్ - పిండాలు పెట్టేస్తున్నారు. అని బ‌లుపు టీజ‌ర్‌లో చెప్పిన చిన్న డైలాగ్ ఆ సినిమాపై ఆగ్ర‌హ జ్వాల‌లు ర‌గిల్చింది. బ్ర‌హ్మ‌ణులు మ‌రోసారి, పంచె బిగించి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మీ సినిమాని విడుద‌ల కానివ్వ‌కుండా చూస్తాం అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దాంతో బ‌లుపు... టీమ్ త‌మ బ‌లుపు త‌గ్గించి దిగి వ‌చ్చింది. ఈ సినిమాని బ్రాహ్మ‌ణ పెద్ద‌ల‌కు చూపించింది.

దేనికైనా రెడీలో  సురేఖావాణి బ్రాహ్మ‌ణ గృహిణిగా న‌టించింది. ఇంటికి ఎవ‌రొచ్చినా స‌రే మీరు మా ఆయ‌న‌లా ఉన్నారు అనడం ఆమె మేన‌రిజం. దాంతో బ్రాహ్మ‌ణులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ డైలాగ్ తొల‌గించ‌క‌పోవ‌డంతో ఆ చిత్ర‌బృందానికి పిండాలు పెట్టారు. ఇప్పుడు బ‌లుపులో అదే సెట్యువేష‌న్ వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని. మానిన గాయాన్ని మ‌ళ్లీ ఎందుకు రేపుతారు?  అనేది ఆ వ‌ర్గం ప్ర‌శ్న‌. అందుకే.. ఈ సినిమాకు బ్రాహ్మ‌ణ సెగ త‌గిలింది.

��
అది పెను జ్వాల‌గా మార‌క ముందే చిత్ర బృందం త‌మ త‌ప్పును తెలుసుకొంది. ఆడైలాగ్‌ని క‌త్తిరించ‌డ‌మే కాకుండా ఈ సినిమాని బ్రాహ్మ‌ణుల సంఘ పెద్ద‌ల‌కు చూపించారు. వారి నుంచి ఈ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. అడుసు తొక్కనేల‌, కాళ్లు క‌డ‌గ‌నేల‌??  త‌ప్పు చేయ‌డం ఎందుకు?  మ‌ళ్లీ దాన్ని స‌వ‌రించుకోవ‌డం ఎందుకు?  ఆ బుద్ది ముందు ఉండొచ్చు క‌దా?

మరింత సమాచారం తెలుసుకోండి: