దేవీశ్రీ ప్ర‌సాద్ ద‌గ్గ‌ర ఓ అల‌వాటు ఉంది. త‌న ఆడియో వేడుక అంటే.. హంగామా అంతా త‌నదే. యాంక‌ర్ పాప‌ని కూడా మాట్లాడ‌నివ్వ‌డు. పాట‌లు పాడ‌తాడు, డాన్సులు చేస్తాడు, జోకులు వేస్తాడు. వాట్... నాట్‌??  అన్నీ చేసేస్తాడు. అంతే కాదు. అక్క‌డున్న హీరోల చేత డాన్సులు కూడా వేయిస్తాడు. ఈ సంప్ర‌దాయం సింగం ఆడియో వేడుక‌లోనూ కొన‌సాగించాడు.

సూర్య‌, అనుష్క జంట‌గా న‌టించిన చిత్రం సింగ‌మ్‌. హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని గీతాలు ఆదివారం రాత్రి హైదార‌బాద్‌లో విడుద‌ల చేశారు. వేడుక‌పై ఎప్ప‌ట్లాగే దేవిశ్రీ త‌న డాన్స్ మూమెంట్స్‌తో హంగామా చేశాడు. అంతేకాదు... సింగ‌మ్ డాన్స్ అనే పాట‌కు అనుష్క చేత స్టెప్పులేయించాడు.

��
ఆ త‌ర‌వాత కార్తి, సూర్య‌, ద‌ర్శ‌కుడు హ‌రి - వీళ్లంద‌రినీ వేదిక‌పై పిలిపించి డాన్స‌లు వేయించాడు. మొత్త‌మ్మీద దేవిశ్రీ ప్ర‌సాద్ వేయించిన స్టెప్పులే... ఈ కార్య‌క్ర‌మానికి హైలెట్‌గా నిలిచాయి. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: