రాజ‌మౌళికి జ‌క్క‌న్న అనే పేరు ఎవ‌రు, ఎప్పుడు పెట్టారో గానీ, బాహుబలి స్ర్కిప్టును ఇంకా శిల్పంలా చెక్కుతూనే ఉన్నాడు. ఈగ విడుద‌లై ఇంత‌కాల‌మైనా బాహుబ‌లి సినిమాని ప‌ట్టాలెక్కించ‌లేదు. క‌త్తియుద్ధాల గురించి కొన్ని రోజులు, గుర్ర‌పు స‌వారీ నేర్చుకొనేందుకు కొన్ని రోజులు అంటూ - నెల‌ల త‌ర‌బ‌డి త‌ర్ఫీదులోనే గ‌డిపేశారు.
తాజా స‌మాచారం ఏమిటంటే.. బాహుబ‌లి స్ర్కిప్టు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేద‌ట‌. ఈ సినిమాకి మాట‌లు రాయాల్సివుంద‌ట‌. ఆ బాధ్య‌త బుర్రా సాయిమాధ‌వ్ కి అప్ప‌గించార‌ట‌. ఆయ‌నెవ‌రో కాదు, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌. ఈ పని అంత‌కు ముందు కొంత‌మంది ర‌చ‌యిత‌ల‌కు అప్ప‌గించినా వాళ్లెవ్వ‌రూ ఆశించిన అవుట్‌పుట్ ఇవ్వ‌లేద‌ట‌. దాంతో కృష్ణం వందే.. ర‌చ‌యితని ఎంపిక చేశాడు రాజ‌మౌళి.

��
ఇంకా సంభాష‌ణ‌ల ప‌ర్వం పూర్తి కాలేదంటే - ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో మ‌రి!  ఎంత వంద కోట్ల సినిమా అయినా ఈ లెవిల్లో జాప్యం కూడ‌దు. ఆల‌స్యం అమృతం విష‌యం అన్న‌ట్టు... నెగిటీవ్ టాక్ వ‌చ్చినా రావ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: