హీరో సిద్దారర్ద్  కు తెలుగు సినిమా ప్రేక్షకుల పై కోపం వచ్చింది. తెలుగు చిత్రాల ద్వారా స్టార్ హోదాను సాధించి, దాదాపు ఎనిమిదేళ్లుగా ఎక్కువ శాతం తెలుగు సినిమాలనే చేస్తూ... తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న సిద్దార్థ్... ఆదివారం చెన్నయ్‌లో తెలుగు సినిమాపై, తెలుగు ప్రేక్షకులపై అనుచిత వాఖ్యలు చేసి దుమారాన్ని రేపారు. ఆయన తాజాగా నటించిన ‘తీయవేలై సెయ్యనుమ్ కుమారు’ చిత్రం ఇటీవల విడుదలైంది.  తెలుగులో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ పేరుతో విడుదలైందీ సినిమా.

 ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ఆదివారం చెన్నై విలేకరులతో మాట్లాడుతూ... తెలుగు పరిశ్రమలో పెద్ద హీరోల చిత్రాలు, ప్రేమకథా చిత్రాలకు మాత్రమే ఆదరణ లభిస్తుందని, వినూత్న, ప్రయోగాత్మక చిత్రాలకు ఆదరణ ఉండదని పేర్కొన్నారు. అలాగే ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’లో అతిథి పాత్ర చేసిన సమంతతో హీరోయిన్‌గా చేసిన హన్సికను పోల్చి చూస్తే తన ఓటు సమంతకే అని నొక్కి వక్కాణించారు.  ఒకవేళ రెండో అవకాశం వస్తే అప్పుడు హన్సిక గురించి ఆలోచిస్తానని నిర్మొహమాటంగా చెప్పారు. మీరు ద్విభాషా చిత్రాల్లోనే నటిస్తారా? అన్న ఓ విలేకరి ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, కొన్ని చిత్రాలకే అలా కుదురుతుందని అన్నారు.

 ప్రస్తుతం తమిళంలో తాను వసంతబాలన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘కావ్య తలైవన్’ లాంటి చిత్రాలను రెండు భాషల్లో రూపొందించలేమన్నారు.  ఎందరో తమిళ హీరోలను మన హీరోల కన్నా ఎక్కువగా అభిమానించే మన ప్రేక్షకుల సంస్కారం తెలియకనే ఇటువంటి వ్యాఖ్యలు చేసాడా అన్నది అందరికీ ఆశ్చర్యంగా ఉన్నది....

మరింత సమాచారం తెలుసుకోండి: