అల్లుఅర్జున్ తను నటించే సినిమా సినిమాకు డిఫరెంట్ గా కనిపించాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ విషయంలో సినిమా కధ విషయంలో అయినా కొద్దిగా సద్దుకుం టాడు కానీ  దర్శకుల విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ అవడు బన్నీ. తనతో పని చేసే దర్శకుల ట్రాక్‌ రికార్డ్‌ని అతను చాలా పట్టించుకుంటాడు. ఆర్య తర్వాత కొత్త దర్శకులతో పని చేయడమే మానేశాడు. హిట్‌ ఇచ్చిన దర్శకులని, అనుభవజ్ఞులని ఎంచుకుంటాడు.

అలాంటి అల్లు అర్జున్‌ యావరేజ్‌ సినిమాలు తీసిన గోపీచంద్‌ మలినేనికి ఛాన్స్‌ ఇస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. డాన్‌ శీను, బాడీగార్డ్‌ చిత్రాలతో యావరేజ్‌ రిజల్ట్స్‌ సాధించిన గోపీచంద్‌ ప్రస్తుతం ‘బలుపు’ చేస్తున్నాడు. ఈ చిత్రం రిజల్ట్‌ ఏమిటో తేలకముందే అల్లు అర్జున్‌కి అతనిపై గురి కుదిరిందని సమాచారం. ఇటీవలే బన్నీని కలిసి గోపీచంద్‌ ఓ కథ వినిపించాడట. అది అల్లు అర్జున్‌కి నచ్చేసిందని, తప్పకుండా చేద్దామని మాటిచ్చాడని అంటున్నారు. మరోవైపు బలుపు సినిమాకి పాజిటివ్‌ టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

ఈ చిత్రంతో గోపీచంద్‌ మలినేని పెద్ద హిట్‌ కొడతాడని అంటున్నారు. ఈ టాక్‌ అల్లు అర్జున్‌ చెవిన పడడం వల్ల ముందే గోపీచంద్‌ మలినేనిని కాంటాక్ట్‌ చేసి అతడిని రిజర్వ్  చేసుకుని ఉన్నాడా అని అనిపిస్తోంది.  ప్రస్తుతం సురేందర రెడ్డి తో  ‘రేసుగుర్రం’ చేస్తున్న అల్లు అర్జున్‌ తదుపరి చిత్రం గురించి ప్రకటించలేదు.  అందువలన ఈ ఉహాగానాలు వస్తున్నాయి ఎదిఎమైనా ఈ విషయం పై ‘బలుపు’ సినిమా రిజల్ట్ వచ్చిన తరువాత మాత్రమే తేలుతుంది. మొత్తం మీద దర్శకుడు గోపీచంద్ మలినేని బన్నీని తన మాటలతో పడగోట్టినట్ట్లే అనిపిస్తోంది.... 

మరింత సమాచారం తెలుసుకోండి: