ఆట పోగ్రామ్‌తో బుల్లితెర‌పై అల‌జ‌డి రేపాడు ఓంకార్‌. అంద‌రూ అన్న‌య్యా అంటూ ఆప్యాయంగా పిలుచుకొనే ఓంకార్ అన్న‌య్య - ఆ త‌ర‌వాత డైరెక్ట‌ర్ అయిపోయాడు. బుల్లితెర నుంచి వెండితెర‌పైకి లాంగ్ జంప్ చేశాడు. జీనియ‌స్ అనే సినిమా తీసి - ఇక సినిమాల్లోనే త‌న టాలెంట్ చూపిద్దాం అనుకొన్నాడు. అయితే ఆ సినిమా ప‌ల్టీ కొట్టింది. నేర్చుకోవ‌ల‌సింది ఇంకా చాలా ఉంది... అనే సంకేతం పంపింది.
దాన్ని పాజిటీవ్‌గా తీసుకొన్నాడు. మ‌ళ్లీ త‌న‌కు అచ్చొచ్చిన బుల్లితెర‌కు వ‌చ్చేశాడు. యాంక‌ర్ అవ‌తారంలో. 100 %ల‌వ్ అనే పేరుతో ఓ గేమ్ షో స్టార్ట్ చేశాడు. ప్ర‌తి బుధ‌వారం మాటీవీలో ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది.

��
గేమ్‌షొలు, రియాలిటీ షోలు ఎలా ఉండాలి..?  అనే విష‌యంలో ఓ మార్క్‌ని సృష్టించాడు ఓంకార్‌. ఈలోగా బుల్లి తెర‌లో చాలా మార్పులొచ్చాయి. కామెడీ షొలు రాజ్యం ఏలుతున్నాయి. ఈ పోటీ ప్ర‌పంచంలో ఓంకార్ త‌న సొంత శైలిని ఎలా చూపించుకొంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: