ధనుష్ హీరోగా నటించిన ‘రాంజానా’ గత శుక్రువారం బాలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో దక్షణాది యంగ్ హీరోలకి ఎవ్వరికీ దొరకని అదృష్టం ధనుష్ ను వరించింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది, సమస్య ఇక్కడే వచ్చి పడింది ఈ సినిమాలో ధనుష్ తో హీరోయిన్ గా నటించిన సోనమ్ కపూర్ తో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి అల్లుడు ధనుష్ సోనమ్ తో చాలా సన్నిహితంగా ఉంటున్నాడనే వార్తలు బాలీవుడ్ లో గుప్పు మంటున్నాయి.

 దీనికి బలం చేకూరుస్తు ఈ మధ్యన జరిగిన ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో ధనుష్ సోనమ్ నడుం చుట్టూ చేతులు వేసి మీడియాకు పోజులు ఇస్తూ రెచ్చి పోవడంతో ఆ ఫోటోలను చూసిన ధనుష్ భార్యా, రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్ పై మండిపోతూ ఉందట. ఇదే విషయాన్ని తన తండ్రి రజినీ దృష్టికి కూడా తీసుకు వెళ్ళిందట. గతంలో కూడా శ్రుతిహాసన్ ల మధ్య ఇటువంటి వార్తలే వచ్చినప్పుడు తన అల్లుడి దూకుడును రజనీ కట్టడి చేసాడు అని అంటారు .

తన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ‘కొచ్చాడియన్’ సినిమాలో తల పట్టుకుంటున్న రజనీకి తన అల్లుడి ఓవర్ యాక్షన్ మరో సమస్యగా మారిందని కోలీవుడ్ టాక్.... 

మరింత సమాచారం తెలుసుకోండి: