విక్టరి వెంక‌టేష్.....పేరులో వున్నట్టే విజ‌యం ఎప్పుడు గ‌ర్ల్ ప్రెండ్ లా వెంకీ చుట్టూనే తిరుగుతుంటుంది. దాదాపు రెండు ద‌శాబ్ధాల కాలంలో న‌టించింది పెద్ద హీరోల కంటే త‌క్కువ సినిమాలే అయినా స‌క్సెస్ రేటు వెంకీదే టాప్. డిఫ‌రెంట్ స్టోరిస్ కి పెద్ద పీట వేస్తూ ఎలాంటి ఈగోలకు వెళ్లని వెంక‌టేష్ అంటే టాలీవుడ్ లో ఓ స్పెష‌ల్ ఇమేజ్ వుంది. అయితే దేనికైనా ఎక్స్ పైరి డేట్ వుంటుంది అన్నట్టు వెంకీ కెరీర్ కూడా ఎండింగ్ ద‌శ‌కు వ‌చ్చిన‌ట్టు అనిపిస్తోంది. ఈ మ‌ద్య వ‌రుస ప్లాప్స్ ప‌డుతుండ‌టంతో వెంకీతో సినిమా అంటే ఆమ‌డదూరం ప‌రుగెడుతున్నార‌ట ప్రొడ్యుస‌ర్స్. అలాంటి సంఘ‌ట‌న ఇపుడు మ‌రోక‌టి జ‌రిగింది.

మెహ‌ర్ ర‌మేష్ డైరెక్షన్ లో భారీ బ‌డ్జెట్ తో రూపొందిన షాడో బాక్సాపీస్ ద‌గ్గర బ‌కెట్ త‌న్నేయడంతో ప్రొడ్యుస‌ర్ కి భారీగానే న‌ష్టమొచ్చింద‌ట‌.ఆ త‌రువాత వెంకీ డైరెక్ట్ హీరోగా సినిమా అంటే ఏ నిర్మాత ముందుకు రావ‌డం లేద‌ట‌. ఇక లాభం లేద‌నుకొని రీమేక్ సినిమాల‌ను సొంత బ్యాన‌ర్ లో నే నిర్మించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

ఆ మ‌ద్య హిందీ బాడీగార్డ్, ఇపుడు బోల్ బ‌చ్చన్ రీమేక్ లో న‌టిస్తున్న వెంకీ ఇపుడు మ‌రో బాలీవుడ్ సినిమాపై మ‌న‌స్సు పారేసుకున్నాడు. అక్షయ్ కుమార్ న‌టించిన ఓ మైడ్ గాడ్ ని సురేష్ ప్రొడ‌క్షన్ లో రీమేక్ చేయ‌బోతున్నాడు. దీంతో వెంకీ రీమేక్ ల రాజుగా మారాడ‌ని..వెంకీతో సినిమా అంటే నిర్మాత‌లు ద‌డుచుకుంటున్నారని ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: