టాలీవుడ్ లో నే కాదు బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం సినిమాల నిర్మాణ పద్ధతి, మార్కెటింగ్ పద్ధతులు పూర్తిగా మారి పోయాయి. గతంలో సినిమాలను కధను నమ్ముకొని నిర్మిస్తే, ప్రస్తుతం పబ్లిసిటీ ని నమ్ముకొని సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా విడుదల కాకుండానే ఒక హైక్ క్రియేట్ చేసి మొదటి వారంలోనే భారీ వసూళ్ళ పై కన్నేస్తున్నారు. ఈ హైక్ ఎవరు ఎంత పెద్ద స్థాయిలో క్రియేట్ చేయగలిగితే ఆ సినిమా అంత టాప్ రేంజ్ కి కలెక్షన్స్ రూపంలో వెళుతోంది. ఈ పద్ధతి కి మన టాలీవుడ్ లో ఆద్యుడు రామ్ గోపాల్ వర్మ అనే అనుకోవాలి.

రామ్ గోపాల్ వర్మ సినిమాలు ప్రారంభం కాకుండానే సంచలనాలు సృష్టిస్తూ ఏదో ఒక వివాదంతో ముడి పడుతూ ప్రేక్షకుల దృష్టి ని ఆ సినిమాలవైపు తీసుకువెళ్ళేలా చేస్తాయి. దీనివల్ల వర్మ సినిమాలు కమర్షియల్ గా కొన్ని పరాజయం చెందినా సినిమాల బిజినెస్ అయి పోవడంతో నిర్మాత సామాన్యంగా నష్టపోడు. ఇప్పుడు ఇదే పద్ధతి మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి, తాను దర్శకత్వం వహిస్తున్న బాహుబలి సినిమా విషయంలో అనుసరిస్తున్నాడా..? అని అనిపిస్తోంది. సినిమా షూటింగ్ కు క్లాప్ కూడా ఇంకా కొట్టకపోయినా ఏదో విధంగా ఈ సినిమా వార్తలతో రోజులు గడచిపోతున్నాయి. దాదాపు 80 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి ప్రారంభం కాకుండానే ఈ సినిమాకు సంబంధించిన రూమర్స్ తో, ఈ సినిమాపై కూడా విపరీతంగా అటు మార్కెట్ లోనూ ఇటు ప్రేక్షకుల లోనూ హైక్ పెరిగిపోతోంది. కేవలం ఉహగానాలతోనే సరిపెట్టకుండా ఈ సినిమా సంబంధించి మీడియా కు లీక్ లు ఇస్తూ రాజమౌళి కూడా ఈ సినిమా మార్కెటింగ్ రేంజ్ ను పెంచడానికి తన శక్తి మేరకు కృషి చేస్తున్నాడు.

లేటెస్ట్ గా బాహుబలి సినిమా ఐమాక్స్ ఫార్మట్ లో తిస్తున్నానని మరో సంచలన వార్త రాజమౌళి మీడియా కు అందించారు. ఇలా రోజుకు ఒక వార్తతో, పెరిగిపోతున్న ప్రభాస్ గడ్డం, జుట్టు సాక్షి గా అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో ఖచ్చితంగా రాజమౌళి కి అయినా తెలుసా...? అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎలా చూసుకున్నా ఈ సినిమా చాలా నెమ్మదిగా తీస్తారు కాబట్టి కేవలం 2015 లో మాత్రమే తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా ఈ 80 కోట్ల సినిమాకు ఎంత మార్కెట్ హైక్ తిసుకురావాలో అంత హైక్ ను రాజమౌళి తీసుకువస్తాడు అనడంలో సందేహం లేదు. రామ్ గోపాల్ వర్మ సినిమాలకూ, రాజమౌళి సినిమాలకూ కధలో, చిత్రీకరణ విషయంలో ఎటువంటి పోలికలూ లేకపోయినా, తాను దర్శకత్వం వహించే సినిమాకు హైక్ తీసుకురావడంలో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కు ఏకలవ్య శిష్యుడిగానే పేర్కొనాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: