పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు అలీ ఎంత ఇంపార్టంట్ అనేది స్వయంగా ఆ పవర్ స్టారే చాలా సందర్భాల్లో చెప్పాడు. 'ఈ దుర్మార్గుడు లేకుండా సినిమా చేయడం కొంచం కష్టమే. మా అమ్మ కూడా చాలా సార్లు అడిగింది. అలీ లేకుండా సినిమా చేయలేవా అని. అమ్మకు కూడా ఇదే చెప్పాను. అలీ ప్రక్కన ఉంటె అన్ని వాడే చూసుకుంటాడని,' అంటూ పవన్ బాబు అలీ గురించి బహిరంగంగానే ఆ మధ్య ఓ ఫంక్షన్ లో చెప్పాడు. 

 

ఆయన చెప్పాడనే  కాదు పవన్ అన్ని సినిమాల్లో అలీ ఉంటూనే ఉన్నాడు. ఆ విషయం పక్కన పెడితే, దేవిశ్రీ పై పవన్ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఇప్పుడు అలీ లాంటి మరో ఫ్రెండ్ పవన్ కి ఉన్నాడని అనిపిస్తుంది. దేవిశ్రీ కూడా పవన్ అంటే ప్రత్యేక మైన అభిమానం చూపిస్తుంటాడు. సాంగ్స్ కంపోజింగ్ వగైరా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా చూస్తుంటాడు. ఇప్పటి వరకు వీరి కాంబినేషనులో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. రాబోయే పవన్ సినిమాలకు కూడా దేవిశ్రీనే మ్యూజిక్ చేస్తున్నాడు. 

 

అయితే సంపత్ నంది, పవన్ చేయాల్సి ఉన్న ప్రాజెక్టుకి ముందు అందరు తమన్ అనుకున్నారు. కాని పవన్ దేవిశ్రీనే కావాలని మరోసారి ఛాన్స్ ఇప్పించాడు.(ప్రస్తుతం తన చిత్రాలకు దేవి తప్ప మరెవరు న్యాయం చేయలేరు అన్నట్లుగా.) ఇలా పవన్, దేవిశ్రీ పై చూపిస్తున్న స్పెషల్ ఇంట్రెస్టునే అందరూ పవన్ కి దేవి మరో అలీగా మారాడని అనడానికి ఊతం ఇస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: